తెలుగు సినిమా టాప్ ఫైవ్ డైరక్టర్స్ లిస్టులో ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొరటాల శివ సుకుమార్ బోయపాటి శ్రీనివాస్ పేర్లు మాత్రమే. ఈటాప్ డైరెక్టర్స్ లో మొదటి ముగ్గురుకి ఇప్పటి వరకు తాము తీసిన సినిమాలకు పరాజయం అన్న పదమే లేకపోవడంతో ఈటాప్ డైరెక్టర్స్ దర్శకత్వం వహించిన సినిమాలకు సినిమాపూర్తి కాకుండానే అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరగడం సర్వసాధారణం. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ భారీ ఫ్లాప్ ఒకటి కూడ లేకపోవడంతో టాలీవుడ్ మోస్ట్ డిపెండబుల్ డైరెక్టర్స్ లిస్టులో ప్రధమ స్థానంలో ఇప్పటి వరకు కొనసాగాడు.

TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

అయితే కేవలం ఊహించని విధంగా వచ్చిన ఒకే ఒక్క భారీ ఫ్లాప్ ‘అజ్ఞాతవాసి’ తో త్రివిక్రమ్ పని అయిపోయింది అంటూ ప్రచారం జరగడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనికి కారణం త్రివిక్రమ్ వ్యవహార శైలి అని అంటున్నారు. టాప్ దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇండస్ట్రీతో టచ్ లో ఉంటాడు. పబ్లిక్ ఫంక్షన్ లకు వస్తుంటారు. పదిమందిని కాకున్నా ఒకరిద్దర్ని అయినా గుర్తు పట్టి పలకరిస్తుంటారు. స్నేహితుల కోసం తన వాళ్లకోసం తనవంతు సాయం చేస్తుంటారు. కొరటాల శివ తన పని తనదే కానీ ట్విట్టర్ ద్వారా అందుబాటులో ఉంటాడు.

 TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇండస్ట్రీతో చాలామందితో మంచి సంబంధాలు కొరటాలకు ఉన్నాయి. అయితే సుకుమార్ త్రివిక్రమ్ లాగే ఎక్కువగా ఎవరితో మాట్లాడకపోయినా అవసరం అయినపుడు బయటకు రావడం నలుగురితో కలిసి నడవడం అలవాటే. ఇక బోయపాటి శ్రీనివాస్ పక్కా మాస్ మనిషి. ఆయన ఎవరితో కావాలంటే వారితో హాయిగా సరదాగా కలిసిపోతాడు. అయితే త్రివిక్రమ్ వ్యవహార శైలి వేరు. ఆయన తన ప్రియ స్నేహితుడు పవన్ కళ్యాణ్ లాగే ఎక్కడికిరాడు ఎవరితోనూ కలవడు.  ఇప్పుడు ఈ మనస్తత్వమే త్రివిక్రమ్ కు శాపంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనికితోడు త్రివిక్రమ్ కు మీడియా వర్గాలతో సరైన సంబంధాలు లేవు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. ఇప్పుడు ఈవిషయాలే త్రివిక్రమ్ కు శాపంగా మారాయి అని అంటున్నారు. అంతేకాకుండా నిర్మాతలతో సహ దర్శకులతో సరైన సాన్నిహిత్యం త్రివిక్రమ్ కు లేని నేపధ్యంలో త్రివిక్రమ్ పై నుంచి దిగివచ్చాడా ? అన్న ఈర్ష్యతో కూడిన ప్రచారం త్రివిక్రమ్ పట్టించుకొకపోవడమే త్రివిక్రమ్ పై ఇలాంటి నెగిటివ్ ప్రచారం జరగడానికి ఆస్కారం కలిగిస్తోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో త్రివిక్రమ్ ఎంత మేధావి అయినా తన వర్కింగ్ స్టైల్ లో మార్పులు చేసుకోకపోతే భవిష్యత్ లో అతడి కెరియర్ పరంగా సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: