సినిమా లో ముద్దు సీన్స్ కు కండిషన్ పెట్టె హీరోయిన్స్ మనం చూసి ఉంటాము. అది కూడా కొత్తగా వచ్చే హీరోయిన్స్ విషయం లో అయితే ఇప్పుడు ఏకంగా టాప్ హీరోయిన్ అయినటువంటి నయనతార అస్సలు నన్ను సినిమా లో ముట్టుకుంటే సినిమా లో నటించను అని చేబుతుందంటా. తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన నయనతార ఈమధ్య కమర్షియల్‌ చిత్రాలు బాగా తగ్గించేసింది.

Image result for nayanathara

తమిళంలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తోన్న నయనతార తెలుగులో సీనియర్‌ హీరోల చిత్రాలని మాత్రం అంగీకరిస్తోంది. అయితే తనతో సినిమా తీసే నిర్మాతలకి ఆమె ముందుగానే చాలా కండిషన్లు పెడుతోంది. రెమ్యూనరేషన్‌ అధికంగా డిమాండ్‌ చేయడంతో పాటు ప్రమోషన్స్‌కి హాజరు కానని ముందే షరతు విధిస్తోంది. ఇవి కాకుండా తను నటించే హీరోలతో క్లోజ్‌గా కనిపించే దృశ్యాలు చేయనని, ముద్దుల సంగతి అటుంచి ముట్టుకోవడాలు కూడా వుండకూడదని చెప్తోంది.

Image result for nayanathara

 జైసింహా చిత్రంలో ఎక్కడా బాలకృష్ణ చేయి కూడా తనకి తాకకుండా చూసుకుందంటే ఆమె ఈ షరతులు ఎంత సీరియస్‌గా విధిస్తోందో అర్థమవుతోంది. ప్రస్తుతం పూర్తిగా ప్రేమలో మునిగిన నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన రిలేషన్‌షిప్‌ స్టాటస్‌కి తగ్గట్టే తన స్క్రీన్‌ ఇమేజ్‌ కూడా డిగ్నిఫైడ్‌గా వుండేట్టు చూసుకుంటోంది. నయనతార పెడుతోన్న ఈ కండిషన్లని ఒప్పుకున్న వారికి మాత్రమే ఆమె డేట్స్‌ ఇస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: