‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడమే తన రోజువారి పనిగా పెట్టుకున్న   విమర్శకుడు మహేష్ కత్తి తన రూట్ మార్చి ఒక మెట్టు దిగడం ఇప్పడు షాకింగ్ న్యూస్ గా మారింది. గత కొంతకాలంగా పలుమార్లు పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన మహేష్   తనను చాలమంది క్షమాపణ చెప్పమంటున్నారని అయితే తాను పవన్ పై చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెప్పేది లేదన్నాడు.

 KATHI MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే ఇక నుంచి పవన్ పర్సనల్ విషయాల గురించి మాత్రం తాను మాట్లాడనని అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో ఈ వివదాస్పద సినీ విమర్శకుడు తీసుకున్న లేటెస్ట్ స్టాండ్ వెనుక వ్యూహాలు ఏమిటి అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాలను పక్కకు పెట్టి మహేష్ మరో ట్విస్ట్ కూడ ఇచ్చాడు. తాను పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించకపోయినా  రాజకీయంగా సినిమాలపరంగా మాత్రం తన అభిప్రాయాలు చెపుతూనే ఉంటాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు.

 

అయితే తాను పెట్టే పోస్టులకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బూతులు తిట్టకుంటే చాలునని అంటున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ విషయాల పై నటుడు నిర్మాత రాంకీ మహేష్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలు మహేష్ కత్తి మహేష్ పవన్ వ్యక్తిగత జీవితం గురించి రియాక్ట్ కాకుంటే ఈగోల ఉండేది కాదని అంటూ ఆయన ఒక్కడికే అంత ఇగో ఉంటే లక్షలాది మంది పవన్ అభిమానులకు ఎంత ఇగో ఉంటుందని అంటూ మహేష్ కత్తిని ఇరుకున పెట్టాడు.

 KATHI MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అంతేకాదు ఒకవేళ మహేష్ కత్తి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఎవరైనా పవన్ అభిమానులు మహేష్ కత్తిని టార్గెట్ చేస్తే సినిమా పరిశ్రమలోని వర్గాలు మాత్రమేకాదు ప్రతి ఒక్కరు ఆయనను సపోర్ట్ చేస్తారని అంటూ రాంకీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా సంక్రాంతి ముగేసే వరకు తన మౌనవ్రతాన్ని కొనసాగిస్తున్న మహేష్ ఈపండుగ తరువాత ఎలాంటి షాక్ లు ఇవ్వబోతున్నాడు అనే విషయంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..








మరింత సమాచారం తెలుసుకోండి: