చిరంజీవి నాకు ఆదర్శం, ఆయనే నా రియల్ హీరో అనే పవన్ కళ్యాణ్ కు చిరంజీవి కష్టం గురుంచి సరిగ్గా తెలియదు అనుకుంట. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో కష్టపడి పైకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి. నిజంగా చిరంజీవి కష్టం ఆయన చేసే ప్రతీ సినిమాలో కనపడుతుంది డాన్స్, ఫైట్స్ పరంగా అందుకే ఆయన అంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన సినిమా కు వచ్చే ప్రతి ప్రేక్షకుడినీ దృష్టిలో పెట్టుకుని సినిమాను చేస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయం మనకు చిరంజీవి 150 సినిమా కథ విషయంలో కనబడుతుంది. తన కమ్ బ్యాక్ సినిమా కోసం దాదాపు రెండేళ్ళుపాటు కధలు విన్నారు. చివరాఖరికి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు చిరంజీవి.

కానీ అన్నీ ఆదర్శమని చెబుతున్న పవన్ కళ్యాణ్ మాటలకే పరిమితయ్యాడనిపిస్తుంది.దానికి గల కారణం ఆయన చేస్తున్న సినిమాలు.అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కు సరైన హిట్ సినిమా లేదు. సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు ఫ్లాపులు. ఇలాంటి సమయంలో ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి సినిమా ఘోరమైన పరాజయం చవిచూసింది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం చాలాచోట్ల కనిపిస్తుంది. ఈ సినిమా కథను రెండు నిమిషాల లో ఫోన్లో విని ఓకే చెప్పాడట.

ఇది ఎంత పెద్ద నిర్లక్ష్యమో అని. అసలు ఫోన్ లో ఒక నిమిషం కధ చెప్తే ఒప్పుకోవడం ఏమిటని పవన్ కళ్యాణ్ అభిమానులే ప్రశ్నిస్తున్నారిప్పుడు. అంతేకాకుండా డాన్స్ పరంగా, ఫైట్స్ పరంగా పవన్ కళ్యాణ్ ఎంత నిర్లక్ష్యం చూపించాడో సినిమా చూస్తే అర్థమౌతుంది. సినిమాల్లో కొన్ని పాటలకు పవన్ కళ్యాణ్ లిప్ సింక్ కూడా ఇవ్వడం లేదు. ఇలానే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే పవన్ కళ్యాణ్ తిరిగి చీకటి రోజుల్లో కి వెళ్లాల్సిందే. అన్నయ తనకు ఆదర్శం అని చెప్తున్న పవన్ కళ్యాణ్.. సినిమాని సీరియస్ గా తీసుకోవడంలో, డెడికేషన్ లోనూ మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకుంటే బావుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: