రాజమౌళి ‘బాహుబలి’ తెలుగు సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తే పవన్ ‘అజ్ఞాతవాసి’ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి ఇండస్ట్రీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ టాప్ హీరో చూడని భయంకరమైన ఫ్లాప్ గా మారిన ‘అజ్ఞాతవాసి’ వల్ల ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లకు 70 కోట్ల నష్టం వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి.
AGNATHAVASI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం


సాధారణంగా పండుగ సీజన్ లో ప్రతి చిన్న సినిమాకు కూడ కలక్షన్స్ బాగా ఉండే సందర్భంలో సుమారు 80 శాతం డ్రాప్ కలక్షన్స్ లో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శింప బడుతున్న ‘అజ్ఞాతవాసి’ కి మూడవ వారం పోస్టర్ అసలు ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో బయ్యర్లలో ఏర్పడిన టెన్షన్ ను నివారించేందుకు ఈమూవీ నిర్మాత రాథా కృష్ణ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 
AGNATHAVASI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

‘అజ్ఞాతవాసి’ బయ్యర్లతో ఈ సినిమా విడుదలయిన మూడు వారాల లోపే సెటిల్ చేసుకోవాలని నిర్మాత రాధాకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీకి సంబంధించిన బయ్యర్లకు అమ్మిన రేట్లు, వాళ్లు థియేటర్ల నుంచి తీసుకున్న ఫిక్స్ డ్ రేట్లు, అడ్వాన్స్ లు, కలెక్షన్లు అన్నీ సమగ్రంగా తెప్పించి ఈమూవీ బయ్యర్లకు ఏర్పడిన నష్టాల విషయంలో తాము ఎంత వరకు సహకరించగలమో అన్న విషయం పై ‘అజ్ఞాతవాసి’ నిర్మాత త్వరలో ఈమూవీ బయ్యర్లతో సమావేశం కాబోతున్నట్లు టాక్.
 
మార్కెట్ వర్గాలలో నిర్మాత రాథా కృష్ణ హారిక హాసిని ప్రొడక్షన్ హౌస్ కు మంచి పేరు ఉన్న నేపధ్యంలో ఆ పేరును ఎట్టి పరిస్తుతులలోను పాడుచేసుకో కూడదు అన్న ఉద్దేశ్యంతో నిర్మాత రాథా కృష్ణ ఏదోఒక సెటిల్ మెంట్ ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లకు చేస్తాడని టాక్.  ఇది ఇలా ఉండగా ‘అజ్ఞాతవాసి’ విషయంలో పవన్ ను నిర్మాత చినబాబు అడిగినట్లు పవన్ ఆయనకు తప్పకుండా మరో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోందిఅయితే ఈవిషయాలు అన్నీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో తెలియకపోయినా ‘అజ్ఞాతవాసి’ క్రియేట్ చేస్తున్న రికార్డులు మటుకు చరిత్రలో నిలిచిపోతాయి అన్నది వాస్తవం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: