జీవితంలో కష్టపడి పైకి వచ్చేవాళ్ళు ఉంటారు, కష్టపెట్టి పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. తన శ్రమను ,తమ శక్తిసామర్థ్యాలను నమ్ముకొని పైకి వచ్చేవాళ్లు ఉంటారు ,ఇతరుల శ్రమను దోపిడీ చేసి పైకి వచ్చేవాళ్లు ఉంటారు .ఇలా మొదటివారి కోవకు చెందుతాడు నాని. అతడు అంచెలంచెలుగా ఎదిగిన వైనం ప్రతి ఒక్క యువకుడికీ,యువతికి ఆదర్శం. రేడియో జాకీ నుండి మొదలుపెట్టిన ఆయన జీవితం అసిస్టెంట్ డైరెక్టర్ ఆపై హీరొగా వెలుగొందుతూ టాలీవుడ్ లో ఒక స్టార్ గా రాణిస్తున్నాడు.తన సహజసిద్దమైన నటనతో నేచురల్ స్టార్ అన్న క్రెడిట్ ను కూడా కొట్టేసాడు.అష్టాచెమ్మతోహీరోగా తన సినీ కెరీర్ ను ప్రారంభించిన నాని ,అతి కొద్దికాలం లోనే తన విభిన్నమైన కథానాంశాలతో ప్రజలను అలరిస్తూ,ఒక పక్కింటి కుర్రాడిగా అందరి హృదయాలను దోచేశాడు.


ఇక 2017 లో నాని చేసిన నేను లోకల్ ,నిన్ను కోరి ,ఎంసిఏ ఈ మూడూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా హంగామా సృష్టించాయో అందరికీ తెలిసిందే.తీయబోయే ప్రతి సినిమా గురించి నాని ఎంతో శ్రద్ధతీసుకుంటారు.ఇప్పుడు చేస్తున్న కథకు ,తాను తరువాత తీయబోయే కథకు అస్సలు సంబంధం ఉండదు.అయితే ఎంసిఏ   సక్సెస్ లో మునిగి తేలుతున్న నాని ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం అనే  సినిమాలొ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు .


ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు తదితర అంశాల గురించి నాని ట్విట్టర్లో వీడియో పెట్టి  "మొదటగా ఎంసిఏ ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు.ఏదయినా ఒక సినిమా విడుదలవుతుందంటే ఒక నెలముందు కానీ లేక నెలనెర ముందుగాని సినిమా ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది.కానీ సినిమా తీస్తుందే ప్రేక్షకుల కోసం కాబట్టి భోగి రోజు కృష్ణ ,సంక్రాంతి రోజు అర్జున పాత్రల ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తాం,కనుమ రోజు ఒక సాంగ్ ను రిలీజ్ చేస్తాం " అని తన వీడియోలో పేర్కొన్నాడు. అన్నట్లుగానే నిన్న ఒక ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు .ఈరోజు ఇంకొకటి రిలీజ్ అవ్వాల్సి ఉంది .ఏది ఏమైనా సంక్రాంతికి బాగా వాడేస్తున్నాడని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: