నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’ నుండి ‘కృష్ణ’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు.   ప్రేక్షకుల కోసం ఓ చిన్న సర్ ప్రైజ్ ప్లాన్ చేశానని నటుడు నాని చెప్పారు. బోగి సందర్భంగా ఈ సర్ ప్రైజ్ ఇచ్చాడు. నాని హీరోగా కృష్ణార్జున యుద్ధం వస్తోంది.అనుపమ పరమేశ్వరన్, రుష్కర్‌ మీర్‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న గ్రాండ్ గా విడుదల కానుంది.  సినిమా రిలీజ్ కి చాలా టైం ఉండడంతో సంక్రాంతి సందర్భంగా అభిమానులకి మంచి గిప్ట్ ఇచ్చాడు నాని.  పండుగ మూడు రోజులు మూడు డిఫరెంట్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నట్టు ఇప్ప‌టికే వీడియో ద్వారా తెలిపాడు నాని.  

Image result for hero nani

బోగి సంద‌ర్భంగా చిత్రంలో కృష్ణ పాత్ర‌కి సంబంధించిన లుక్‌ని  విడుద‌ల చేశారు. ఇందులో ఊర‌మాస్‌గా క‌నిపిస్తున్నాడు నాని. ఈ రోజు సంక్రాంతి రోజున అర్జున్ పాత్ర ఫస్ట్ లుక్, జనవరి 16 కనుమ రోజున మూవీలోని తొలి పాట‌ లిరికల్ వీడియోని విడుదల చేయనున్నారు. శైన్ స్క్రీన్స్ పతాకంపై గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృష్ణుడు, అర్జునుడు కూడా నానియే. 

Image result for hero nani

ఈ చిత్రంలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుఖ్సార్ మీర్‌లు జోడి కడుతున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం వేసిన సినిమాలు ఇప్పటి వరకు దాదాపు అన్ని హిట్ గానే నిలిచాయి. శైన్ స్క్రీన్స్ పతాకంపై గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. ఒక వైపు వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న నాని, మ‌రో వైపు వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి మంచి చిత్రాలు తెర‌కెక్కించిన‌ మేర్ల‌పాక క‌లిసి కృష్ణార్జున యుద్ధం చిత్రం చేస్తుండ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: