‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి రూపాయి ఖర్చు పెట్టెచోట రెండు రూపాయలు ఖర్చు చేయడం అలవాటు అంటూ తన వ్యహారతీరు పై తానే  సెటైర్లు వేసుకున్నాడు. ఇప్పడు అదే విషయానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.  టాప్ హీరోల సినిమాలలో ఆసినిమాలకు సంబంధించిన హీరోలు వేసుకునే    డ్రెస్ ల పట్ల పర్టిక్యులర్ గా ఉండటమే కాకుండా వాటి పై కూడ చాలాభారీ స్థాయిలో ఖర్చు పెడుతూ ఉంటారు.

 PAWAN KALYAN IN AGNATHAVASI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అల్లు అర్జున్ లాంటి  స్టైలిష్ హీరోలు అయితే  విదేశాలకు వెళ్లి తమ  కాస్ట్యూమ్స్ ను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మరికొందరు టాప్ హీరోలు తమ కాస్ట్యూమ్స్ వ్యవహారాలను తమ పర్సనల్ డ్రెస్ డిజైనర్ లకు అప్పగిస్తారు. ప్రభాస్ తన దుస్తుల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు అన్నవార్తలు ఉన్నాయి. చివరకు నాగశౌర్య లాంటి చిన్నహీరోలు కూడ తన కాస్ట్యూమ్స్ విషయంలో నిర్మాతల చేతబాగా ఖర్చు చేయిస్తాడు అన్నవార్తలు ఉన్నాయి.   

 PAWAN KALYAN IN AGNATHAVASI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో పది నుంచి 25 లక్షల వరకు సినిమాలో హీరో డ్రెస్ ల కోసం ఖర్చు చేస్తారు అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సుమారు 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మింప బడ్డ  ‘అజ్ఞాతవాసి’ మూవీలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కోసం లెక్కకు మించి డిజైనర్లు పనిచేసారని వార్తలు వస్తున్నాయి. కేవలం పవన్ డ్రెస్ ల కోసం 90 లక్షల బిల్లు చెల్లించినట్లు వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

 సంబంధిత చిత్రం

గతంలో ప్రభాస్ కు పనిచేసిన డ్రెస్ డిజైనర్ నే ఈసినిమా కోసం పవన్ కు డ్రెస్ లు విషయంలో ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ డిజైనర్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ పై మరలా మరి కొంతమంది ప్రముఖ కాస్ట్యూమ్స్ డిజైనర్స్ అభిప్రాయాలు కూడ  తీసుకోవడంతో ఇలా ఖర్చు  తడిసి మోపెడై 90 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’  కధ విషయంలో ఎందుకు అన్ని పొరపాట్లు చేసాడో ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్న..

 


మరింత సమాచారం తెలుసుకోండి: