సూర్య.. తమిళ్ సూపర్ స్టార్..! తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇటీవలికాలంలో ఆయన నటించిన సినిమాలన్న్నీ తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆంధ్రాలో సూర్య గోడ దూకిన సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

Image result for ganga surya movie

సంక్రాంతికి సూర్య నటించిన గ్యాంగ్ సినిమా రిలీజైంది. విగ్నేష్ శివన్ నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ప్రమోషన్ కోసం సూర్య ఆంధ్ర వచ్చారు. సక్సెస్ మీట్ లో భాగంగా ఆయన రాజమహేంద్రవరం వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను చూడ్డానికి పెద్దఎత్తు తరలివచ్చారు. మేనక థియేటర్లో సూర్య ఫ్యాన్స్ తో కలిసి కాసేపు సినిమా చూశారు.


థియేటర్ నుంచి బయటికొచ్చి చూస్తే బయటంతా భారీఎత్తున జనం గుమికూడారు. దీంతో కాసేపు ఆలోచించిన సూర్య.. సడన్ గా వెనుక గేట్ వైపు వచ్చారు. అక్కడ కూడా ఫ్యాన్స్ ఉండడంతో ఎటూ వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సడన్ గా ఆ గేట్ ఎక్కేశాడు సూర్య. ఒక్కసారిగా సూర్య గేట్ దూకి బయటకు దూకడంతో థియేటర్ యాజమాన్యం షాక్ కు గురైంది. గేట్ దూకి బయటికొచ్చాక సూర్య కొంతమంది అభిమానులను పలకరించారు. ఆ తర్వాత కార్ లో తిరుగు ప్రయాణమయ్యారు.


సూర్య సింప్లిసిటీ పర్సన్. చాలా ఫ్రీగా కలిసిపోతుంటారు. ఈ మధ్యే ఓ వేడుకలో అభిమానుల కాళ్లకు దండం పెట్టడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు గోడ దూకి బయటకు రావడంతో ఫ్యాన్స్ తో పాటు థియేటర్ యాజమాన్యాన్ని కూడా కంగు తినిపించాడు సూర్య. అందుకే సూర్య ఏం చేసినా వెరైటీనే..!


మరింత సమాచారం తెలుసుకోండి: