తమిళంలో ఈ తమ్మికి ఫుల్ క్రేజ్ ఉంటుంది..ఎంతో చిన్న వయసులో అనిరుద్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించాడు..ధనుష్ కొలవెరి సాంగ్ ఎన్ని సంచలనాలని సృష్టించిందో..ఎంతమంది నోటి వినిపించిందో అందరికీ తెలిసిన విషయమే..చిన్నా పెద్దా తేడాలేదు..భాషతో పని లేదు అన్నట్టుగా ఎల్లలు దాటి ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది..అప్పటి నుంచీ ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తునే ఉన్నాయి.

 Image result for anirudh

అయితే తాజాగా అనిరుద్ తెలుగులోకి అజ్నాతవాసి సినిమాతో అడుగు పెట్టాడు..పవన్ కళ్యాణ్ –త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నా సినిమా అందులోనూ త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు మరి ఇంకేం అనికున్నాడు అనిరుద్..తన సత్తా తెలుగులో కూడా చాటాలని  భావించాడు...తీరా చూస్తే అనిరుద్ మ్యూజిక్ ఎవరికీ నచ్చలేదు. కనీసం ఒక్క సాంగ్ కూడా బాగాలేదని ఫీడ్ బ్యాక్ వచ్చింది. అంతే కాదు సినిమా కు బ్యాక్ గ్రౌండ్ కూడా మైనస్ గా నిలిచింది. ఈరోజు అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ కు కారణాల్లో అనిరుద్ మ్యూజిక్ కూడా ఒకటి అని టాక్ ఫుల్ ప్రచారం అయ్యింది... ఆ ఎఫెక్ట్ అంతా అనిరుద్ నెక్స్ట్ తెలుగు మూవీ కి ఎఫెక్ట్ అయ్యింది.

 Related image

మొదట ఎన్టీఆర్- త్రివిక్రమ్  కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి అనిరుద్ ను ఎంచుకున్నారు...అయితే అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో ఇప్పుడు అనిరుద్ ప్లేస్ లో దేవి శ్రీ ని తీసుకోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది..అయితే ఈ నిర్ణయం వెనుక ఎన్టీఆర్ గట్టిగా పట్టు బట్టాడని తెలుస్తోంది..అయితే ఎన్టీఆర్ గట్టిగా చెప్పడంతోనే త్రివిక్రమ్ కి తప్పక అనిరుద్ కి హ్యాండ్ ఇచ్చాడని టాక్..మరి అనిరుద్ ఈ సినిమాలో ఉన్నాడా లేడా అనేది తెలియాలంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేంతవరకూ ఆగాల్సిందే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

 Image result for devi sri


మరింత సమాచారం తెలుసుకోండి: