ఎన్నో భారీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన త్రివిక్రమ్ కు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది ఆయన దర్శకత్వం మీద ఇప్పుడు స్టార్ హీరోలు కూడా భయపడుతున్నారు. దానికి గల కారణం తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి సినిమా ఫలితం. సినిమాలో ఎక్కడా కనీసం త్రివిక్రమ్ మార్క్ కనబడలేదు. మొత్తం త్రివిక్రమ్ కెరీర్ లో అజ్ఞాతవాసి సినిమా చాలా దెబ్బకొట్టింది.

త్రివిక్రమ్ ప్రస్తుతం ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ తో అని మనకందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి దీనికి కారణం అజ్ఞాతవాసి చిత్రం కాదని సినీవర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ భారీ మల్టీస్టారర్ సినిమా ఎన్టీఆర్–రామ్ చరణ్ లతో  రాజమౌళి తీస్తున్నాడని మనకందరికీ తెలుసు.

అయితే ప్రస్తుతం ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి రెండు నెలల్లో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే హీరో మరో సినిమా చేసే అవకాశం ఉండదు. డేట్స్ పూర్తిగా ఆ చిత్రానికే కేటాయించాల్సి ఉంటుంది. అలా ఉంటుంది రాజమౌళి ప్లాన్. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల చిత్రం వాయిదా పడడమో, ఆగిపోవడమో జరగక తప్పదని చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..!  


మరింత సమాచారం తెలుసుకోండి: