పవన్ ‘అజ్ఞాతవాసి’ విడుదలై నేటితో 7 రోజులు పూర్తి చేసుకుని రేపటితో రెండవ వారంలోకి ప్రవేసిస్తోంది. అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈమూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి కేవలం ఇలాంటి సంక్రాంతి సీజన్ లో కూడ 50 కోట్ల నెట్ కలక్షన్స్ దాటలేదు అంటే ఈమూవీ ఎలాంటి ఘోర పరాజయాన్ని పొందిందో అర్ధం అవుతోంది.

 AGNATHAVASI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన సినిమాలు ఒక్కటి కూడా అర్థం పర్థం లేని సినిమా తీయలేదు. అలాంటిది ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ ని ఇలా ఎందుకు తీసాడు అని ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్న చర్చలలో కొన్ని ఆసక్తికర కారణాలు బయటకు వస్తున్నాయి. సర్వసాధారణంగా దర్శకులు తాము తీసే సినిమా స్క్రిప్ట్ కు అదనంగా పది శాతం నుంచి ఇరవై శాతం వరకు ఎక్కువ షూట్ చేయడం సర్వసాధారణం.

 

ఇండస్ట్రీ వర్గాలలో మేధావులుగా పేరుగాంచిన త్రివిక్రమ్, సుకుమార్ లాంటి వారు మాత్రం తమ స్క్రిప్ట్ కు అదనంగా ముఫై నుంచి నలభై శాతం వరకు అదనంగా తీస్తారు అన్న ప్రచారం ఉంది. అయితే ‘అజ్ఞాతవాసి’ సినిమాకు త్రివిక్రమ్ తీసిన ఫుటేజ్ నాలుగు గంటల వరకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఫుటేజ్ ను మొదట మూడు గంటలకు తగ్గించి ఆ తరువాత రెండు గంటల నలబై నిముషాలకు ఈసినిమాను మళ్ళీ తగ్గించడంతో విపరీతమైన గందరగోళం ఏర్పడి అసలు ఎడిటింగ్ సెక్షన్ లో ఏమి జరుగుతోందో త్రివిక్రమ్ కే తెలియని పరిస్థుతులు ఏర్పడ్డాయి అని టాక్.

 AGNATHAVASI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనికితోడు ఈసినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముంబాయిలో గ్రాఫిక్ చెన్నయ్ లో రీ రికార్డింగ్, డిటీఎస్ మిక్సింగ్, హైదరాబాద్ లో ఎడిటింగ్ ఇలా వివిధ చోట్ల వివిధ రకాల పనులు జరిగిన నేపధ్యంలో త్రివిక్రమ్ ఈమూడు పనులను కోఆర్డినేట్ చేసుకునే విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాడని దానిఫలితం ఎడిటింగ్ పై కనిపించింది అని అంటున్నారు. ఒకవైపు పని ఒత్తిడి మరొక వైపు గంట ఫుటేజ్ మిగిలిపోవడం వల్ల హడావిడితో కూడిన ఎడిటింగ్ ఇలా అనేక కారణాలు ‘అజ్ఞాతవాసి’ పరాజయానికి కారణాలుగా మారాయి అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కారణాలు విశ్లేషణలు చేసుకున్నా పవన్ త్రివిక్రమ్ ల కెరియర్ లో మాయని మచ్చగా ‘అజ్ఞాతవాసి’ మిగిలిపోయింది అన్నది మాత్రం వాస్తవం..

 


మరింత సమాచారం తెలుసుకోండి: