టాప్ డైరెక్టర్ రాజమౌళికి దేవుడు పై నమ్మకం తక్కువ. ఈవిషయాన్ని రాజమౌళి స్వయంగా అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు. అయితే రాజమౌళి సినిమాలలో మాత్రం దేవుడు సెంటిమెంట్ కు సంబంధించిన కీలక సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. సామాన్యంగా సినిమా సెలబ్రిటీలకు ఎక్కువగా ఉండే సెంటిమెంట్లు రాజమౌళి సినిమాలలో కూడ బాగా కనిపిస్తూ ఉంటాయి.

 

దీనితో ఈ సెంటిమెంట్స్ వలయం నుండి రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ కు కూడ బయటకు రాలేకపోతున్నాడా ? అన్న కామెంట్స్ గతంలోనే వచ్చాయి. ఇలాంటి పరిస్థుతులలో రాజమౌళి పై ఇప్పుడు సోషల్ మీడియా వర్గాలలో హడావిడి చేస్తున్న ఒక లేటెస్ట్ రూమర్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. గత 17 సంవత్సరాలుగా పరాజయం అన్న పదం ఎరగకుండా వరసవిజయాలు సాధిస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన రాజమౌళి ప్రస్తుత పరిస్థితికి ఆయన జాతక బలం కూడ బాగా కలిసి వచ్చిందట.

 RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహాల మార్పుల ప్రకారం ఇప్పటివరకూ రాజమౌళికి శుక్ర దశ నడిచిందట. అందుకే ఏంపట్టినా బంగారం అయిందట. కానీ ఇప్పుడు మాత్రం జాతకం రీత్యా రాజమౌళి జాతకంలో గ్రహాలు మారుతున్నాయట. జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహ సంచారం ప్రకారం రాజమౌళి జాతకానికి సంబంధించిన గ్రహాల సంచారంలో ప్రారంభం కాబోయే దశ అంత మంచిది కాదు అని తెలియడంతో రాజమౌళి కుటుంబ సభ్యులు ఇప్పటికే అనేక మంది పండితులను సిద్ధాంతులను సంప్రదించి ఏంచేయాలో అని  ఆరా తీశారని టాక్.

 RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

జ్యోతిష్య పండితులు సూచించిన ప్రకారం శాంతి పూజలు హోమాలు చేసేందుకు రాజమౌళి కుటుంబసభ్యులు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తల గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికి సంబంధించి రాజమౌళి సన్నిహితులు కొందరు మంత్రాలయంలో ఉన్నారట. రామ్ చరణ్ ఎన్టీఆర్ లు నటించే మల్టీస్టారర్ మూవీ అఫీషియల్ ప్రకటనకు ముందే ఈపూజలు పూర్తిచేయాలని రాజమౌళి కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు టాక్. అయితే దైవశక్తిని నమ్మని రాజమౌళి గ్రహాల ప్రభావాన్ని నమ్మడని ఎవరో కావాలని ఇలాంటి నెగిటివ్ ప్రచారం రాజమౌళి పై చేస్తున్నారు అంటూ మరికొందరు ఈవార్తలను గాసిప్పులుగా నెట్టి పారేస్తున్నారు..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: