‘ఫిదా’ సినిమాతో క్రేజీ బ్యూటీగా మారిన సాయిపల్లవి పై అనేక రూమర్లు ఇప్పటికే వచ్చాయి. హీరో నానీతో ఆమెకు ‘ఎంసిఏ’ నిర్మాణంలో భేదాభిప్రాయాలు వచ్చాయని గతంలో ప్రచారంజరిగింది. అయితే ఇప్పుడు ఆవార్తలు చాలామంది మరిచిపోయిన పరిస్థుతులలో యంగ్ హీరో నాగశౌర్య సాయి పల్లవి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతి సందర్భంగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య ఈకామెంట్స్ చేసాడు.

 ఈర్ష్యగా ఫీలవ్వడం లేదు

‘సాయి పల్లవి గతంలో ఒక హీరోతో గొడవ పడిందని ఆతర్వాత వారిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు అనేవార్తలను నేను విన్నాను. సాయ పల్లవి ఏసినిమా చేసినా గొడవలు అవుతున్నాయని విన్నాను అవి రూమర్లో కావో నాకు తెలియదు. అయితే నాసినిమా షూటింగ్ సమయంలో కూడా నాకు ఆమెకు విభేదాలు చోటుచేసుకొన్నాయి’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు నాగ శౌర్య. అంతేకాదు తాను ప్రస్తుతం సాయిపల్లవికి వచ్చిన క్రేజ్ చూసి జెలసీగా ఫీలై తాను ఈకామెంట్స్ చేయడం లేదని తన కెరీర్‌లో ఎంతోమంది అందగత్తెలను చూశాను అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇదేసందర్భంలో నాగశౌర్య మాట్లాడుతూ సాయిపల్లవిని చూసి ఈర్ష్యగా ఫీలవ్వడం కంటే దూకి చచ్చిపోతాను అంటూ విచిత్ర కామెంట్స్ చేసాడు.

సాయి పల్లవి అందంగా ఉండదని 

తనకు సాయిపల్లవిని చూసి కుళ్లుపడాల్సిన అవసరంలేదని తనసినిమా మరోహీరో చేశాడనో, లేదా నాకు రావాల్సిన ఛాన్స్ మరోహీరో కొట్టేశాడు అంటే ఈర్ష్యగా ఫీల్ అవచ్చు కానీ తాను సాయిపల్లవిని చూసి ఈర్ష్య పడవలసిన అవసరం తనకు లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల టాలీవుడ్‌ కు సాయిపల్లవిని పరిచయం చేయకపోతే ఆమెకు ఈక్రేజ్ వచ్చేదా అంటూ ఆమె పై సెటైర్లు వేసాడు నాగశౌర్య.

 SAIPALLAVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అదేవిధంగా ‘ఫిదా’ సినిమాలో వరుణ్ తేజ్ ఎంతబాగా నటించాడో సాయిపల్లవి కూడా అదేచేసింది అంటూ సాయిపల్లవికి ఎంత పేరొచ్చిందో వరుణ్ తేజ్‌ కు అంతే పేరు రావాల్సి ఉంది అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ నాగశౌర్య మరొక ట్విస్ట్ ఇస్తూ సాయిపల్లవి అందంగా ఉండదు అని తాను అననని ఆమె ‘ఫిదా’ లో మాట్లాడిన తెలంగాణ యాస ప్రభావంతో ఆమె మరింత అందంగా కనిపించిందని అభిప్రాయాన్ని వెల్లడించాడు ఈయంగ్ హీరో. సాయిపల్లవి, నాగశౌర్య కలిసి ‘కణం’ అనే తమిళ చిత్రంలో నటించారు. ఈచిత్రం తమిళ, తెలుగు భాషల్లో రూపొందింది. ఈచిత్రం త్వరలో విడుదలకాబోతున్న నేపధ్యంలో ఈమూవీని ప్రమోట్ చేస్తూ నాగశౌర్య ఈఆసక్తికర కామెంట్స్ చేసాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: