పండుగలన్నీ శాస్త్రీయ దృక్పథంతో ఏర్పడినవే. ప్రతి పండుగను జరుపుకోవడం వెనుక ఒక సహేతుక కారణం ఉంటుంది. మారుతున్న ఋతు ధర్మానికి అనుగుణంగా మనకి మనం సరిచేసుకోవడానికి ఈ ఋతుధర్మానికి తగిన విధంగా మన దైనందిన ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి పండుగలను ప్రామాణికంగా చేసారు మన పెద్దలు. పెద్ద పండుగగా పిలువబడే సంక్రాంతి పండుగలో ఈరోజును కనుమ పండుగగా పరిగణిస్తాం.

 KANUMA FESTIVAL PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈ సీజన్ లో అన్ని పంటలు చేతికి వచ్చి రైతు చేతినిండా ధనంతో కళకళలాడే పరిస్థితులనేపధ్యంలో తన పొలాలలో పనిచేసిన పనివారిని అందరినీ ఇంటికి  పిలిచి కనుమ రోజు విందు ఇవ్వడమే కాకుండా వారందరికీ కొత్త బట్టలు పెట్టె  సంప్రదాయం ఇప్పటికే పల్లె ప్రాంతాలలో కొనసాగుతోంది. ఈ కనుమ పండుగను పశువుల పండుగ అని కూడ పరిగణిస్తూ ఉంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు.

 సంబంధిత చిత్రం

పల్లెల్లో పశువులే గొప్పసంపద అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం మరియు సంపద. అందుకే వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు  కనుమ పండుగ ప్రత్యేకతలు. ఈ కనుమ రోజున చాలాచోట్ల  గ్రామాలలో జోడెడ్ల బండి పోటీలు పరుగుపందేలు నిర్వహిస్తారు.   

 

దీనికి తోడు గతంలో పశువుల నుండి వచ్చే వ్యర్థాలు కంపోస్ట్ గా రైతులు వినియోగించే వారు.  అప్పట్లో ఎవరింట్లో వారు పండించుకునే కూరగాయలకై తగిన స్థలం ఉండటంతో వాటికి ఈ పశు వల వ్యర్దాలకు సంబంధించిన కంపోస్ట్ ను ఎరువులుగా వాడి ఎవరికి వారే సంవృద్దిగా కూరలు పండించుకునేవారు. అయితే అటువంటి వాతావరణం ఇప్పుడు పల్లెలలో కూడ కనుమరుగై  పోతున్న సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇప్పటికీ చాలా చోట్ల పసువాలను పూజించే ఆచారం కొనసాగుతూనే ఉంది. తెలుగు సాంప్రదాయలకు గ్రామీణ వాతావరణానికి చిరునామాగా ఉండే సంక్రాంతి పండుగ రోజురోజుకు తన ప్రభావాన్ని కోల్పోతున్నా ఇంకా సంక్రాంతి అంటే ఉత్సాహంతో ఆనందంతో ఉరకలు వేసే పల్లెలు ఇంకా ఎన్నో మన తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తూనే ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: