సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని తెలిసిందే. శ్రీమంతుడు తర్వాత క్రేజీ కాంబోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. భరత్ అను నేను టైటిల్ ప్రచారంలో ఉన్నా అది కన్ ఫాం మాత్రం చేయలేదు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ వచ్చింది. సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తున్న సందర్భంగా ఫస్ట్ లుక్ బదులు ఫస్ట్ ఓథ్ (ప్రమాణ స్వీకారం) అన్నట్టుగా పోస్టర్ వదిలారు.


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ ఏంటన్న దాని మీద కన్ ఫ్యూజన్ 26తో తీరిపోతుంది. ఫస్ట్ లుక్ లో మహేష్ ఎలా ఉండబోతాడు అంటూ ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపుల తర్వాత మహేష్ ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకుంటున్నాడు. కచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టి తీరాల్సిందే అంటూ యూనిట్ తో చర్చిస్తున్నాడట. అందుకే సినిమాకు సంబందించిన ప్రతి విషయంలో మహేష్ ఇన్వాల్వ్ అవుతున్నాడట. మొత్తానికి మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ వచ్చింది. ఇక టైటిల్ కాస్త రివీల్ అయ్యి మహేష్ లుక్ వస్తే సినిమా ఇంకాస్త క్రేజ్ తెచ్చుకుంటుంది.


అసలైతే సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఏప్రిల్ 27న రిలీజ్ అన్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ కూడా కష్టమే అన్నట్టు చెబుతున్నారు. మహేష్ సినిమా జూన్ కు వెళ్లిందని అంటున్నారు. కొరటాల శివతో తీసిన శ్రీమంతుడు సినిమా జూన్ 10న రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించింది. మరి మహేష్ కూడా మరోసారి అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: