వరుస విజయాలతో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని ఇంకా థియేటర్ లో తన సూపర్ హిట్ బొమ్మ ఎం.సి.ఏ ఆడుతూనే ఉండగా మరో సినిమాతో ముందుకొస్తున్నాడు. మేర్ల పాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమాలో నాని డబుల్ యాక్షన్ అని తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా ఇప్పటికే పోస్టర్స్ వదిలిన నాని ఈరోజు ఏకంగా ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు.


మాంచి మాస్ బీట్ సాంగ్ లా అనిపిస్తున్న ఈ సాంగ్ లో నాని లుంగీ లుక్ లో అదిరిపోయాడు. ఓ సినిమా ఆల్రెడీ థియేటర్స్ లో ఆడుతుండగా మరో సినిమా ఇంత స్పీడ్ గా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం అది కేవలం నాని వల్ల మాత్రమే అవుతుందని అంటున్నారు. సక్సెస్ రేటు కూడా బాగా ఉండటంతో టైం వేస్ట్ చేయకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.


ఇక నాని ఈ స్పీడ్ చూసి స్టార్స్ సైతం షాక్ అవుతున్నారు. తన మార్క్ సినిమాలతో దూసుకెళ్తున్న నాని కృష్ణార్జున యుద్ధం కూడా పక్కా హిట్ అన్నట్టుగా కానొస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటుకున్న మేర్లపాక గాంధి ఈ సినిమాకు ఎక్స్ ప్రెస్ సెంటిమెంట్ వదిలి చేస్తున్నాడు. 


ఏప్రిల్ 14న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నాని కెరియర్ లో మరో క్రేజీ హిట్ గా నిలుస్తుందని చిత్రయూనిట్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: