త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో జూనియర్ డిఫెరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు అన్న ప్రచారం ఇప్పటికే జరిగింది. దీనికితోడు జూనియర్ ఈ సినిమాలోని తన లుక్ గురించి బాగా సన్నపడ్డాడు అన్న విషయాలను జూనియర్  సన్నిహితులు కూడా అంగీకరిస్తున్నారు.

 JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఫిబ్రవరి నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి తన లుక్ ఎక్కడా లీక్ కాకూడదు అన్న ఉద్దేశ్యంతో  జూనియర్ కూడా ఎక్కడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాకు సంబంధించి  బాలీవుడ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్ కు ఫిట్నెస్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.  

 JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే  నిన్న సంక్రాంతి సందర్భంగా తన ఫిట్నెస్ ట్రైనర్ కు గాలిపటాలు ఎగరేయడం నేర్పిస్తున్న ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాకు లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జూనియర్ అభిమానులు ఒకరికి ఒకరు ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ  ఎన్టీర్ లుక్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోను చాలా జాగ్రత్తగా పరిశీలించిన అభిమానులు  'జై లవ కుశ' తో కంపేర్ చేస్తూ ఎన్టీఆర్ విపరీతంగా తగ్గిపోయాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ గెడ్డం మినహాయిస్తే దాదాపుగా 'బృందావనం' నాటి లుక్ లోకి  జూనియర్ మారిపోయాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.

 సంబంధిత చిత్రం

ఇది ఇలా ఉండగా  'అజ్ఞాతవాసి' ఘోర పరాజయంతో అయోమయంలో  పడ్డ త్రివిక్రమ్ ను ఇరుకున పెట్టకుండా వీలైనంత సమయం తీకుని తన సినిమా మొదలు పెట్టమని ఏవిషయంలోను టెన్షన్ పడవద్దని జూనియర్ త్రివిక్రమ్ కు పూర్తి భరోసాఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఏమైనా త్రివిక్రమ్ రహస్యంగా  ఉంచుదాము అనుకున్న జూనియర్ లుక్ ఇలా  సంక్రాంతి సందర్భంగా బయటకు రావడం జూనియర్ అభిమానులకు విపరీతమైన ఆనందాన్నిఇస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: