తెలుగు తెర సీతమ్మ అంజలి తెలుగు సినిమా రంగంలో పెద్దగా రాణించలేకపోయినా తమిళ సినిమా రంగంలో మటుకు బాగా  రాణించింది. ఈమె నటించిన సినిమాలు కంటే ఈమె పై వచ్చిన వివాదాలు ఎక్కువకావడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సీతమ్మ ఎప్పుడు గుర్తు ఉంటుంది.

 

ఈమె వ్యక్తిగత జీవితం పైన మాత్రమే కాకుండా ఈమె ఫిజిక్ విషయంలో అంజలి పై ఎన్నో విమర్శలు ఉన్నాయి. గతంలో ఈమె తన ఫిజిక్ పై వచ్చిన కామెంట్స్  ను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమోకాని అంజలి తన లుక్ ను మార్చుకుని అందరికీ షాక్ ఇచ్చింది.   

 ANJALI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

కొన్ని నెలల క్రితం విడుదల అయిన ‘బెలూన్’ మూవీలో కూడా బొద్దుగానే కనిపించిన అంజలి నిన్న తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను చూసి అందరు షాక్ అవుతున్నారు. అంజలిని ఇంత చిక్కిన శరీరంతో చూడడం ఇదే మొదటిసారి కావడంతో ఆమె అభిమానులు ఆమె ఫొటోకు లైక్ లు కొడుతున్నారు.  అయితే ఇంత సడెన్ గా అంజలి ఎందుకు సన్నబడిపోయిందనే విషయం పై మాత్రం క్లారిటీ రావడంలేదు.

 ANJALI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఏదైనా కొత్త సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఇలా తయారైందా ? లేదంటే అంజలి ప్రియుడు  కోలీవుడ్ హీరో జై అడిగాడని ఇలా తగ్గిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  ఆమధ్య నందమూరి సింహం  బాలకృష్ణ తనకు బాలయ్య నటించే భవిష్యత్ సినిమాలలో అవకాసం ఇస్తాను అని ప్రామిస్ చేసినట్లు అంజలి ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అంజలి లుక్ మారింది కాబట్టి బాలయ్య ఎంతవరకు తన మాటను నిలబెట్టు కుంటాడో చూడాలి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: