బాలకృష్ణ హీరోగా నటించిన 'జై సింహా' బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ను నిజంచేస్తూ ఆసినిమాకు డివైడ్ టాక్ వచ్చినా నెమ్మదిగా సెటిల్ అయి బాక్సాఫీసు వద్ద సంతృప్తికరమైన  ఫలితాలు సాధిస్తోంది. ఒక విధంగా ఈసినిమా సంక్రాంతి రేస్ విన్నర్ గా మారింది అని వస్తున్న వార్తలు కూడా చాలమందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

  ‘జై సింహ' కూడా అజ్ఞాతంలోకి వెళ్లింది (కత్తి మహేష్ రివ్యూ)

ఈసినిమాకుసంబంధించి ఒక సీన్లో పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ తో బాలయ్య వాగ్వివాదానికి దిగుతాడు. ఈక్రమంలో తన పవర్ చూపించడానికి ఒంటిచేత్తో బొలెరో కారు పైకి ఎత్తే సీన్ ఒకటి వస్తుంది. ఈ సీన్ ను చూసి బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా మాస్ ప్రేక్షకులు కూడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాలకృష్ణకు ఇలాంటి సీన్లు సూట్ అవుతాయని దర్శకుడు కే.ఎస్ రవికుమార్ ఈ సీన్ క్రియేట్ చేసాడు.

 JAISIMHA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇది ఇలా ఉండగా  మహేంద్రా బొలెరో కారును బాలయ్య ఒంటిచేత్తో పైకి లేపే సన్నివేశం పై మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహింద్రా ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘హాహా.. బొలెరో కార్లను చెక్ చేయాడానికి మా సర్వీసింగ్ సెంటర్లలో ఇకపై హైడ్రాలిక్ లిఫ్ట్‌లు వాడనవసరం లేదు'' అని ట్వీట్ చేశారు. బొలెరో సీన్ కావడంతో ఈవిషయాన్ని కొందురు నెటిజన్లు ఆనంద్ మహింద్ర దృష్టికి తీసుకెళ్లారట. దీనితో షాక్ అయిన ఆనంద్ మహేంద్ర ఇలా బాలకృష్ణ పై జోక్ చేస్తూ ఈ ట్విట్ చేసాడు.


 BALAKRISHNA IN JAYASIMHA MOVIE కోసం చిత్ర ఫలితం

దీనితో బాలకృష్ణ ఖ్యాతి ఇతర రాష్ట్రాల్లోనూ మార్మోగి పోతోంది అంటూ బాలయ్య అభిమానులు ఈమూడు రోజుల సంక్రాంతి పండుగను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మన  టాప్ హీరోలు తాము నటించే సినిమాలలో బొలెరో కార్లను మాత్రమే కాదు అవసరం అనుకుంటేవిమానాలను కూడ ఎత్తేస్తారు. అప్పుడే మన టాప్ హీరోల అభిమానులకు నిజమైన పండుగ..


మరింత సమాచారం తెలుసుకోండి: