అజ్ఞాత వాసి సినిమా లో వెంకటేష్ నటించాడన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఫిలిం మేకర్స్ వెంకటేష్ సన్నివేశాలను మొదట రోజు తొలగించారు. అయితే ఫ్లాప్ టాక్ వచ్చిన వెంటనే మేకర్స్ ఉలిక్కి పడ్డారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నిజానికి సంక్రాంతి నుంచి వెంకీ సన్నివేశాల్ని యాడ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. కానీ వసూళ్లు రోజురోజుకు పడిపోతున్న నేపథ్యంలో.. భోగి నుంచే వెంకీని సినిమాలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ అజ్ఞాతవాసి పతనం ఆగలేదు.

Image result for venkatesh and pavan kalyan

కలెక్షన్లు మెరుగుపడలేదు. నిజానికి అజ్ఞాతవాసి విడుదలైన రెండో వారానికి వెంకటేశ్ నటించిన సన్నివేశాల్ని జతచేయాలనుకున్నారు. ఇలా చేయడం వల్ల రిపీట్ ఆడియన్స్ పెరిగి, కలెక్షన్లు మరింత పెరుగుతాయనేది మేకర్స్ ఫీలింగ్. కానీ సినిమా ఇంతలా ఫ్లాప్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆఘమేఘాల మీద విడుదలైన 4రోజులకే వెంకీ నటించిన 7నిమిషాల సన్నివేశాలు జతచేశారు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం.

Image result for venkatesh and pavan kalyan

కాసులు కురిపించే సంక్రాంతి సీజన్ లో కూడా అజ్ఞాతవాసి వెలవెలబోతోంది. వెంకీ, పవన్ కాంబినేషన్ లో సన్నివేశాలు యాడ్ చేయడం వల్ల అజ్ఞాతవాసికి ఆడియన్స్ పెరగలేదు. ఆది, సోమవారాలు ఈ సినిమా వసూళ్లలో, ఆక్యుపెన్సీలో ఎలాంటి మార్పు కనిపించలేదు. సినిమానే బాగాలేనప్పడు వెంకీ సీన్లు జతచేయడం వల్ల జనాలు వచ్చేస్తారని భావించడం యూనిట్ అవివేకం. దీనినే అంటారేమో చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం అంటే.


మరింత సమాచారం తెలుసుకోండి: