సాయి పల్లవి ఫిదా తో తెలుగు చిత్ర పరిశ్రమ కి వచ్చి అందరిని ఫిదా చేసింది. తాజాగా ఎంసీఏ తో మన ముందు కు వచ్చింది ఆ సినిమా లో కూడా తన నటన తో అందరిని మెప్పించింది. అయితే ఈ క్యూట్ అమ్మాయిని లిప్ లాక్ సీన్ లో నటిస్తే అభిమానులు చూడాలనుకుంటున్నారు. అయితే, ఒక చిత్రానికి ఓకే చెప్పేందుకు ఈమె ఎక్కడలేని కండీషన్లు పెడుతుందనే ప్రచారం ఉంది.

Image result for saipallavi

దీనిపై సాయి పల్లవి తాజాగా స్పందిస్తూ, కొందరి దృష్టిలో అందాల ఆరబోతనే గ్లామర్‌ అనుకుంటారు. అలా అనుకుని నా దగ్గరకు కొందరు వచ్చారు కూడా! వారి ఉద్దేశం అర్థమయ్యే వారి సినిమాలు చేయను. గ్లామర్‌ పేరుతో అందాల ఆరబోత నాకు ఇష్టం ఉండదు. అవే కండిషన్లు అనుకుంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు.  ఒక చిత్రానికి నా దృష్టిలో కథనే హీరో.

Image result for saipallavi

మిగతా వారంతా నటులే! ఆ హీరో గురించి తెలుసుకోకుండా ఎలా ఓకే చెబుతాను. నా పక్కన ఎవరు చేస్తున్నారు? అన్నది పట్టించుకోను. ఇవన్నీ చెబితే కండిషన్లంటారు! ఇక లిప్‌లాక్‌లు లాంటివి నా వల్ల కాదు. నేను మధ్య తరగతి అమ్మాయిని. అలాంటి వాటికి మా పేరెంట్స్‌ అస్సలు ఒప్పుకోరు. నేను సినిమాలు చేస్తానంటే వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టారు. అందులో లిప్‌లాక్‌లు ఒకటి. అందుకే ఆ తరహా సీన్లకు దూరంగా ఉంటున్నాను అని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: