టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేందర్ రెడ్డి - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘రేసు గుర్రం’ సినిమా  సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ సినిమాలో 
బూచాడే బూచాడు అంటూ బన్నీ సరసన సెక్సీ స్టెప్పులు వేసిన కైరాదత్ గుర్తుందా..? ఈ పాటతో తెలుగులో ఐటం గర్ల్‌గా బిజీ అవుతుందనుకున్న కైరా, మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ‘రేసుగుర్రం' వచ్చిన మూడేళ్ల తర్వాత   బాలకృష్ణ సరసన 'పైసా వసూల్' సినిమాలో మళ్లీ  కైరా దత్ హట్ అందాలతో మురిపించింది. 
Related image
అయితే ఐటమ్ సాంగ్‌తో పాటు ప్రాధాన్యత కలిగిన కీలక పాత్రను ఈ సినిమాలో కైరా పోషించింది.  ఇక టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉత్తరాది భామలు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన బ్యూటీలు ఐటమ్స్ సాంగ్స్ హాట్ గా రెచ్చిపోతున్నారు.  కైరాదత్ ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఉత్తరాదిన బోల్డ్‌ క్యారక్టర్లు చేశాను. కానీ వాటి వల్ల రాని గుర్తింపు ఐటెంసాంగ్స్‌తోనే వచ్చింది.
Image result for Kyra Dutt race gurram
ఐటెంసాంగ్స్‌ చేస్తే వచ్చే కిక్కే వేరు. సినిమాలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్‌ చేసినా రానంత పేరు ఓ ఐటెంసాంగ్‌తో వస్తుంది.  ఇక పాటల కోసం వేసే సెట్టింగ్, మ్యూజిక్ వింటుంటే..డ్యాన్స్ దానంతట అదే వస్తుందని చెబుతుంది.  ఇక ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిన నాకు మంచి గుర్తింపే వస్తోంది. ఇక్కడ వరుస అవకాశాలు వస్తున్నాయి. 
Image result for Kyra Dutt race gurram
రేసు గుర్రం లో అల్లు అర్జున్ తో స్టెప్పులు వేయాలంటే..ఎంతో ప్రాక్టీస్ చేసి మరీ వేయాలని అంటుంది. ఇక పైసా వసూల్ సినిమా లో బాలయ్యతో డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని..బాలయ్య ఎంతో ఎనర్జీ కలిగిన నటుడని మెచ్చుకుంటుంది. తెలుగులో చాలా మందితో కలిసి చేయాలని ఉందని అంటుంది ఈ బాలీవుడ్ బ్యూటి. 


మరింత సమాచారం తెలుసుకోండి: