‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తో అవమాన భారంలో ఉన్న పవన్ అభిమానులకు కోలీవుడ్ హీరో సూర్య తన ‘గ్యాంగ్ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ చేస్తున్న కామెంట్స్ పవన్ అభిమానులకు షాక్ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులలో హీరో సూర్యాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘శివపుత్రుడు’ ‘గజిని’ సినిమాలతో సూర్యకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది.

 SURYA AT GANG MOVIE PROMOTION FUNCTION PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే ఆతరువాత విడుదలైన చాల సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయినా ఎదో విధంగా హిట్ కొట్టాలి అన్న ప్రయత్నాలు సూర్య చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా సూర్య ఈసారి పవన్ భాలక్రిష్ణ సినిమాలతో పోటీ పడుతూ తన ‘గ్యాంగ్ సినిమాను విడుదల చేయడమే కాకుండా ఆ సినిమాను ప్రమోట్ చేస్తూ ఏకంగా ప్రతి ఊరుకు వెళ్లి దియేటర్స్ లో ప్రేక్షకుల మధ్య హడావిడి చేస్తున్నాడు.

 SURYA AT GANG MOVIE PROMOTION FUNCTION PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనికితోడు అదృష్టం కూడ తోడవ్వడంతో ‘గ్యాంగ్’ సినిమాకు నెమ్మది నెమ్మదిగా కలక్షన్స్ పెరిగి అందరికీ ఆశ్చర్యాన్ని కలుగ చేస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో హీరో సూర్య కేవలం తన సినిమాను ప్రమోట్ చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై మాట్లాడుతున్నాడు. దీనికి కారణం అతడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన కామెంట్స్. జగన్ కు సపోర్ట్ గా మాట్లాడాడుతూ సూర్య జగన్ కుటుంబానికి తనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తాను కాలేజీలో చదువుకునే రోజుల నుంచి జగన్ తనకు మంచి మిత్రుడు అంటూ కామెంట్ చేసాడు సూర్య.

 SURYA AT GANG MOVIE PROMOTION FUNCTION PHOTOS కోసం చిత్ర ఫలితం

అంతేకాదు జగన్ పాదయాత్రను స్వాగతిస్తూ  రాజకీయాలతో నిమిత్తం లేకుండా జగన్ కుటుంబంతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని సూర్య పేర్కొన్నాడు. దీనితో సూర్య వ్యూహాత్మకంగా తన సినిమాల అభిమానులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను మార్చుకునే వ్యూహాలు రచిస్తున్నాడా అంటూ మరికొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. రాజకీయాలను సినిమాలను కలుపుకుని కెరియర్ విషయంలో ముందుకు వెళ్ళడంలో పవన్ ఫెయిల్ అవుతూ ఉంటే ఎక్కడో చెన్నై నుంచి వచ్చిన సూర్య తన అభిమానులను పెంచుకోవడానికి వైసీపీ ఫ్యాన్స్ ను కలుపుకుంటూ చేసిన కామెంట్స్ జనసేన అభిమానులకు షాక్ ఇవ్వడమే కాకుండా ఇన్ని తెలివితేటలు పవన్ కు ఎందుకు లేవు అని బాధ పడుతున్నట్లు టాక్..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: