బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి తీయబోయే భవిష్యత్ సినిమాలలో తమకు అవకాశాలు వస్తే చాలు అని చాలామంది టాప్ స్టార్స్ భావిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా రాజమౌళి త్వరలో తీయబోతున్న సినిమాకు నాగార్జున మూవీ టైటిల్ కు నాగార్జున గతంలో నటించిన మూవీ టైటిల్ స్పూర్తిగా మారింది అన్న గాసిప్పులు ప్రస్తుతం హడావిడి చేస్తున్నాయి.

 

తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగవ్రాసిన రాజమౌళి తన తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో ఒక మల్టీ స్టారర్ గా మార్చి నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఈసినిమాకు సంబంధించి కథ విషయంలో రాజమౌళి తనతండ్రి విజయేంద్ర ప్రసాద్ తో ప్రస్తుతం చర్చలు చేస్తూ ఈసినిమా స్క్రిప్ట్ కు ఒక తుది రూపం ఇస్తున్నాడు.

 

ఈసినిమా కథ ఇద్దరు హీరోల చుట్టూ తిరుగుతుంది కాబట్టి చరణ్ జూనియర్ ల అభిమానులకు బాగా నచ్చే టైటిల్ కోసం రాజమౌళి ఆలోచిస్తున్నప్పుడు ఆయన దృష్టిలో ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరావు నాగార్జున కలిసినటించిన ఒకసినిమా టైటిల్ పై పడినట్లు టాక్. చాల సంవత్సరాల క్రితం అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున కలిసి నటించిన ‘ఇద్దరూ ఇద్దరే’ అన్న మూవీలో నటించారు.

 RAJAMOULI Along with nagarjuna latest photos కోసం చిత్ర ఫలితం

అప్పట్లో ఈసినిమా మంచి సక్సస్ అయింది. ఇప్పుడు ఆసినిమా టైటిల్ రాజమౌళి చరణ్ జూనియర్లతో తీయబోతున్న సినిమాకు బాగా నప్పుతుంది అన్నభావనతో జక్కన్న ఈ టైటిల్ కు ఓటు వేసినట్లు టాక్. అంతేకాదు ఈసినిమా ఇంకా ప్రారంభం కాకుండానే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లుగా కూడ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన ఈసంక్రాంతికి వస్తుందని భావించినా కొన్ని సెంటిమెంట్లు వల్ల రాజమౌళి ఈమల్టీ స్టారర్ విషయం ప్రకటనను మరికొంత కాలానికి వాయిదా వేసినట్లు టాక్.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: