సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు బైకులు, కార్లు అంటే తెగ మోజు చూపిస్తుంటారు.  ఈ క్రమంలో కొంత మంది అక్రమ రిజిస్ట్రేషన్లు చేయిస్తూ అడ్డంగా బుక్ అవుతుంటారు. ఆ మద్య హీరోయిన్ అమలాపాల్‌ తప్పుడు చిరునామా పత్రాలు సృష్టించి పన్ను ఎగ్గొట్టిన కేసు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  తాజాగా నటి అమలాపాల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సరెండరయ్యారు.
Image result for అమలాపాల్‌
పన్ను ఎగవేత విషయంలో అమలాపాల్‌ కొన్ని నెలలుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. తప్పుడు చిరునామాను వినియోగించి గతేడాది ఆమె రూ. కోటి విలువజేసే కారును కొనుగోలు చేశారు. దీంతో రూ. 20 లక్షల పన్ను ఎగవేసినందుకు  కేరళా పోలీసులు 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో న్యాయస్థానం క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
Image result for అమలాపాల్‌
అంతే కాదు ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దాన్ని కోర్టు తిరస్కరించింది. తాను అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి అడ్రస్‌తోనే కారు కొన్నానని ఆమె పోలీసులకు తెలిపారు. అవి తప్పుడు పత్రాలేనని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.  కాగా, అమలాపాల్‌ సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల వద్ద లొంగిపోయారు.
Image result for అమలాపాల్‌
ఈ సందర్భంగా ఆమె తప్పుడు పత్రాలు చూపినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులను కలిసిన తర్వాత అమలాపాల్‌ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. అయితే అమలాపాల్ ఇచ్చిన వివరణపై పోలీసులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: