సినిమాలు తీయడంలోనే కాదు ఆసినిమాలను ప్రమోట్ చేయడంలో ఆసినిమాలకు మంచి బిజినెస్ రాబట్టడంలో రాజమౌళికి ఉన్న తెలివితేటలు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరెవ్వరికీ లేవు. అందుకనే అనేక ప్రముఖ విద్య సంస్థలు తమ వద్ద బిజినెస్ స్టడీస్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్దులకు రాజమౌళి చేత అనేకసార్లు గెస్ట్ లెక్చర్స్ కూడ ఇప్పించారు.

 

ఇలాంటి పరిస్థుతులలో రాజమౌళి లేటెస్ట్ గా నిర్మించబోతున్న చరణ్ జూనియర్ ల భారీ మల్టీ స్టారర్ గురించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. రాజమౌళి ఈమధ్య ఈసినిమా నిర్మాతలను పిలిచి ఈసినిమా బడ్జెట్ గురించి చర్చించినట్లు టాక్. చరణ్ జూనియర్ లతో పాటు తనకు కూడ పారితోషికం లేకుండా నిర్మింపబడుతున్న ఈమూవీకి 90 కోట్ల బడ్జెట్ అవుతుందని రాజమౌళి లెక్కలు చెప్పినట్లు తెలుస్తోంది.

 RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఎటువంటి గ్రాఫిక్ వర్క్స్ లేకుండా పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిర్మింపబడుతున్న ఈసినిమాను ఒకేసారి తెలుగుతో పాటు తమిళ హిందీ భాషలలో కూడ రిలీజ్ చేయాలని రాజమౌళి ఉద్దేశ్యం అని అంటున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ లో ఈసినిమాను మొదలుపెట్టి ఈమూవీ షూటింగ్ ను 9 నెలలలో పూర్తిచేసి 2019 దసరా పండుగకు ఈమూవీని రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ అని తెలుస్తోంది.

 RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం రాజమౌళికి ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీకి అన్ని భాషలలోను కలిపి దాదాపు 250 కోట్ల బిజినెస్ చేసి సంచలనం క్రియేట్ చేయడమే కాకుండా చరణ్ జూనియర్ రాజమౌళిల షేర్ కింద సుమారు 100 కోట్ల భారీ పారితోషిక ప్యాకేజ్ రాజమౌళి రచించినట్లు తెలుస్తోంది. ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా రాజమౌళి తన లేటెస్ట్ మల్టీ స్టారర్ కోసం డిజైన్ చేసిన బిజినెస్ ప్లాన్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది..   

 


మరింత సమాచారం తెలుసుకోండి: