పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ కు కారణాలు ఎన్నో చెప్పొచ్చు. అయితే ఆ సినిమా ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో తెలుగు ఆడియెన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అనిరుద్ బయటకొచ్చి చూస్తే వరకు ఓకే.. గాలి వాలుగా కూడా పర్వాలేదు అయితే మిగతా సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. త్రివిక్రం సినిమాలో బ్య్కా గ్రౌండ్ స్కోర్ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. 


అత్తారింటికి దారేది సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ అయ్యింది. అయితే అజ్ఞాతవాసి అనిరుద్ మ్యూజిక్ ఇచ్చే సరికి తేడా కొట్టేసింది. అది పక్కన పెడితే ఇప్పుడు తారక్ తో చేయబోయే సినిమాను అనిరుద్ ను కంటిన్యూ చేయాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డారట చిత్ర దర్శక నిర్మాతలు. ఎన్.టి.ఆర్ కాంపౌండ్ మెంబర్స్ కూడా అనిరుద్ వద్దే వద్దని చెబుతున్నారట.


ఎన్.టి.ఆర్ డ్యాన్స్ బాగా చేస్తాడు. మరి అనిరుద్ క్లాసిక్ మ్యూజిక్ తారక్ కు సరిపోదని అంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ నుండి అనిరుద్ ను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. త్రివిక్రం దేవి మధ్యలో గొడవ అంటూ ఏది లేదని కేవలం దేవి తన సినిమా డేట్స్ వల్లనే అజ్ఞాతవాసికి పనిచేయలేదని తెలుస్తుంది. మరి ఇప్పుడు ఎన్.టి.ఆర్ అడిగితే దేవి శ్రీ ప్రసాద్ కాదని అంటాడా అన్న ప్రశ్న రేజ్ అవుతుంది.


మొత్తానికి అనిరుద్ రవిచందర్ తెలుగులో ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నట్టే అంటున్నారు. కోలీవుడ్ లో అతను స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అయితే తెలుగు ఆడియెన్స్ కు నచ్చేలా పాటలు ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యాడు. కనీసం సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా అజ్ఞాతవాసి ఇంత అట్టర్లీగా పోయేది కాదు అని ఫ్యాన్స్ ఫీలింగ్.  మరి త్రివిక్రం డెశిషన్ మార్చుకుంటాడా లేక అనిరుద్ నే ఎన్.టి.ఆర్ సినిమాకు కంటిన్యూ చేస్తాడా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: