ఒక క్రికెట్ టీమ్ సంఖ్యకు దగ్గరలో ఉన్న మెగా యంగ్ హీరోల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. త్వరలో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తో కలుపుకుంటే మెగా యంగ్ హీరోల సినిమాల విడుదలకు సంవత్సరానికి ఉన్న 12 నెలలు కూడ సరిపోవు.

 

చిరంజీవి ఏర్పరిచిన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీ వర్గాలలో మెగా యంగ్ హీరోలుగా పేరు తెచ్చుకున్న వీరంతా తమ మధ్య చిన్నచిన్న భేధాబిప్రాయాలు ఉన్నా ఎక్కడా బయట పడరు. దీనికితోడు తామంతా ఒకటే అన్న సంకేతాలు ఇస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు.

 

సంక్రాంతి అంటే మెగా కుటుంబంలో ఒక పెద్ద పండుగ. ఎవరికీ ఎన్ని పనులు ఉన్నా అవన్న్నీ పక్కనపెట్టి బెంగుళూరులోని చిరంజీవికి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ లో మెగా కుటుంబ సభ్యులు అందరూ సంక్రాంతిని ఎంజాయ్ చేయడం ఎప్పటి నుంచో వారికున్న అలవాటు. ఈ సంవత్సరం కూడా మెగా కుటుంబ హీరోలు అంతా చిరంజీవి బెంగుళూరు గెస్ట్ హౌస్ లో సంక్రాంతిని ఎంజాయ్ చేసారు.

 CHIRANGEEVI WITH MEGA YOUNG HEROES PHOTOS కోసం చిత్ర ఫలితం

ఈవిషయానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు షేర్ చేసారు. ఈ ఫోటోలను చూసిన మెగా అభిమానులు మెగా హీరోలు ఒకరిపట్ల ఒకరు తమ అభిమానాన్ని వ్యక్తపరుచుకుంటూ తీసుకున్న ఫోటోలను అభినందిస్తూ గతంలో చిరంజీవి ప్రేమగా పవన్ భుజం చుట్టూ చేయి వేసి తీయించుకున్న ఫోటోతో ఈ ఫోటోలను కూడ పోలుస్తూ అభిమానం విషయంలో చిరంజీవి పవన్ ల మధ్య ఉన్న ప్రేమానురాగాలను మెగా యంగ్ హీరోలు కూడా అదే పోజును అనుసరిస్తున్నారు అంటూ మెగా యంగ్ హీరోల మధ్య ఉన్న అభిమానం పై ప్రశంసలు కురిపిస్తున్నారు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: