పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ప్రమోట్ అయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన ద్వారకా పర్వాలేదు అనిపించుకోగా అర్జున్ రెడ్డి సినిమాతో మాత్రం అంచనాలకు మించి వసూళ్లను రాబట్టి అదరగొట్టాడు. 2017 సెన్సేషనల్ మూవీస్ లో అర్జున్ రెడ్డి మొదటి 3 స్థానాల్లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఆ సినిమాతో కుర్రాడి రేంజ్ ఎక్కడికో వెళ్లింది. 


ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది. గీతా గోవిందా టైటిల్ తో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 10 కోట్ల దాకా పెడుతున్నారట. సినిమా రిచ్ గా వచ్చేందుకు ఇంతా పెడుతున్నా విజయ్ ఇప్పటిదాకా చేసిన సినిమాలు కేవలం 5 కోట్ల లోపే అవడం విశేషం. మరి కెరియర్ లో మొదటిసారి విజయ్ దేవరకొండ తన బడ్జెట్ రేంజ్ ను మించి సినిమా తీస్తున్నాడు.


లవ్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్న పరశురాం ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో ఈ సినిమా తీస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకులు నచ్చే సినిమాగా ఉంటుంది.  మరి ఈ సినిమా కూడా అర్జున్ రెడ్డి లాంటి భారీ హిట్ కొడుతుందో లేదో చూడాలి.


ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చి నెలలో సినిమాలు భారీగా రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది త్వరలో తెలుస్తుంది. కేవలం ఇది ఒక్కటే కాదు విజయ్ దేవరకొండ ఈ ఇయర్ లో దాదాపు రెండు మూడు సినిమాలతో వస్తున్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: