పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  నటించిన అజ్ఞాతవాసి సినిమా పవన్ అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఎన్నికలకు ముందు ఈ సినిమాతో హిట్ కొట్టి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నా పవన్ కు అజ్ఞాతవాసి సినిమా గట్టి షాకిచ్చింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

తీయబోయే సినిమాకి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్టు వార్తలు వినబడుతున్నాయి. అయితే బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కలిగిన సినిమాను చేస్తున్నారట. రాబోయే ఎన్నికల దృష్ట్యా బాలకృష్ణ కు మంచి మైలేజి వచ్చేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట.

కాగా పవన్ కళ్యాణ్ బోయపాటితో  సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుండడంతో బోయపాటి కూడా బాలకృష్ణ సినిమా ను ప్రక్కనపెట్టి పవన్ తో చేయడానికి రెడి అవుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాపులు పలకరించడంతో పవన్ కళ్యాణ్ కూడా   అభిమానులని సంతృప్తి పరచడానికి బోయపాటి తో పవన్ కళ్యాణ్ చర్చలు మొదలుపెట్టాడట.

వీరి చిత్రం ఎప్పుడు మొదలు కావొచ్చు, ఏ జోనర్ లో ఉండొచ్చు అనే విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చర్చలు ఓ కొలిక్కి వచ్చాక దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చు. ఫాన్స్ కూడా చేస్తే బోయపాటి తోనే చెయ్యి నాయనా నీకొక దండం, అతను ఇచ్చిన స్క్రిప్ట్ కి సైలెంట్ గా సంతకం పెట్టు మాస్ హిట్ ఇస్తాడు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: