కత్తి మహేష్ ఇతను పేరు ఇంత బాగా మారుమోగి పోతుందంటే దానికి కారణం టీవీ 9 అని చెప్పవచ్చు. అయితే కత్తి మహేష్ ఈరోజు ఉమ్మడి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. టీవీ-9 తెలుగు న్యూస్ ఛానెల్లో తనకు 5 శాతం వాటా ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ వేశారు.కొంత కాలం క్రితం వరకూ టీవీ9 తెలుగు మార్కెట్ వాల్యూ కేవలం రూ. 175 కోట్ల విలువ మాత్రమే ఉండేదని, గడిచిన 3 నెలల్లో తన షో ల ద్వారా విపరీతమైన రేటింగ్ పెంచుకుందని ఆయన పేర్కొన్నారు.

Image result for kathi mahesh

తాజా లెక్కల ప్రకారం మార్కెట్ వాల్యుని 175 నుంచి రూ. 200 కోట్లకు పెంచుకుందని, దీనికి తోడు ప్రకటనల టారిఫ్ సైతం భారీగా పెంచుకుని లాభపడిందని ఆ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. అందుకు సంభందించిన పత్రాలను కూడా ఆయున ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో తనకు రాయల్టీ కింద ఆ సంస్థలో 5 శాతం వాటా ఇప్పించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ ని ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

Image result for kathi mahesh

కాగా కత్తి పిటిషన్ తో టీవీ9 యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన లాయర్లతో కలిసి హుటాహుటిన హైకోర్టుకు వచ్చి కత్తికి వ్యతిరేఖంగా మరో పిటిషన్ దాఖలు చేసింది. కత్తి పిటిషన్ ని విచారణ దశలోనే కొట్టేయాలని అభ్యర్థించింది. పనీపాటా లేకుండా తిరుగుతున్న ఆయనకు భోజనాలు పెట్టి మరీ తమ స్టూడియోలో కూర్చోబెట్టుకున్నామని, ఆయన్ని పెంచి పెద్ద చేసింది ఇంతటివాడినీ చేసిందీ తామేనని  చివరికి తమపైకే ఎదురు తిరగడం భావ్యం కాదని ఆ పిటిషన్ లో పేర్కొంది.

Image result for kathi mahesh

తాము చేసింది తప్పేనని, ఇకనుంచి బుద్దిగా వ్యవహరిస్తామని ఇలాంటి పనికిమాలిన వారితో చర్చాగోష్ఠులు పెట్టి కొత్త సమస్యలు సృష్టించబోమని వారు కోర్టుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు ఎందుకంటే ఈ కంటెంట్ ఫేస్ బుక్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ నుంచి సేకరించింది. కాబట్టి దీనిని గమనించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: