కాంట్రొవర్సీలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. ఎవరి మీద పడతాడే తెలీదు. ఏం అనౌన్స్ చేస్తాడో తెలీదు. ఓసారి పాలిటిక్స్.. ఇంకోసారి క్రైమ్.. ఇంకోసారి సెక్స్.. మరోసారి గాడ్.. ఇలా ఆయన కథావస్తువులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్. ఇప్పుడు ఆయన సెక్స్, గాడ్.. అంశాలపై రచ్చ రచ్చ చేస్తున్నాడు.

Image result for rgv gst

సినిమాలు తీయడంలో ట్రెండ్ సెట్ చేసిన ఘనత వర్మది. ఆయన వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్. విలక్షణ కథలే కాదు.. టెక్నికల్ గా కూడా వర్మది డిఫరెంట్ మెథడ్. టెక్నికల్ గా వేరియేషన్స్ చూపించడంలో చాలా ముందుంటాడు. కొన్ని గంటల్లోనే సినిమా తీసేసిన ఘనత ఆయనకు చెందుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ కు అనుగుణంగా వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టాడు.

Image result for rgv gst

తాజాగా 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' పేరుతో వర్మ రిలీజ్ చేసిన ట్రైలర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బూతును మరో రేంజ్ కు తీసుకెళ్లినట్టు ఆ ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. సెక్స్ కు, దేవుడికి ఉన్న సంబంధాన్ని ఆ చిత్రంలో చూపించబోతున్నట్టు స్పష్టం చేశాడు. అంతేకాదు.. సెక్స్ పట్ల స్త్రీల మనస్తత్వానికి అద్దం పట్టేలా ఆ సినిమా ఉంటుందని తేల్చేశాడు. స్త్రీలందరూ తలెత్తుకుని తిరిగేలా ఈ చిత్రం ఉంటుందన్నాడు. అమెరికన్ పోర్న్ ర్‌ మియా మల్కోవా ఈ సినిమాలో స్టార్.

Image result for guns and thighs rgv

ఓ వైపు నాగ్ తో.. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్.. మరోవైపు కడప వెబ్ సిరీస్.. తాజాగా మియా మల్కోవాతో షార్ట్ ఫిల్మ్.! అసలేంటీ వేరియేషన్స్..? అసలు వర్మ ఏం చేయబోతున్నాడనేది అస్సలు ఎవరికీ అర్థం కావడం లేదు. జనాలు జుట్టుపీక్కుంటునేట్టు చేస్తున్నాడు వర్మ.

Image result for kadapa rgv

ఆ మధ్య గన్స్ అండ్ థైస్ అని ఓ ట్రైలర్ రిలీజ్ చేశాడు. మాంఛి మాస్ మసాలా దట్టించాడు. ఆ తర్వాత రాయలసీమ రెడ్ల చరిత్ర చెప్తానంటూ కడప ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడేమో ఏకంగా సెక్స్, గాడ్ అంటూ పిచ్చెక్కించేస్తున్నాడు. అసలు వర్మ ఎందుకు ఇలా తయారయ్యాడని సినిమా వర్గాలే చర్చించుకుంటున్నారు. ఎప్పుడేం చేస్తాడో అర్థం కాని వర్మను ఓసారి పిచ్చాసుపత్రికి తీసుకెళ్లాల్సిందేనని మరికొందరు వాదిస్తున్నారు. అయితే.. తాను మాత్రం తను అనుకున్నదే చేస్తాడు. అదే వర్మ నైజం.. నిజం కూడా..!!


మరింత సమాచారం తెలుసుకోండి: