పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయింది.ఈ సందర్భంగా మొదటి షో పడగానే  ఫ్లాప్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు భారీగా వచ్చాయి సోషల్ మీడియాలో, మెయిన్  మీడియాలో కూడా. గతంలో ఎన్నడూ లేనంతగా   పవన్ కళ్యాణ్ మిద ఈసారి దాడి జరిగింది.

అయితే ఈ విమర్శల వెనుక ప్రత్యర్ధుల శక్తులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు. రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ చూసి ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు భయపెడుతున్నారని, ఈ క్రమంలో సినిమా అపజయం పాలవడంతో అటు ప్రత్యర్థులు ఇటు మిత్రుల ముసుగులోని శత్రువులు పరిశ్రమలో పోటీదార్లు అన్నిటినీ మించి మీడియాలో వ్యతిరేకులు కూడబలుక్కుని పవన్‌ను ప్లాప్‌ హీరోగా నిరూపించే కుట్ర చేశారన్నది అభిమానుల అభియోగం.

అయితే ఒక్క సినిమా ప్లాప్ అవ్వగానే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం మాకు పోదు అని పవన్ అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరో గా  కన్నా వ్యక్తి  గానే మాకు ఎక్కువ  ఇష్టం అని స్పష్టం చేశారు. ఆ వ్యక్తి శక్తి అయి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తాడని మాకు నమ్మకం ఉంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: