అజ్ఞాత వాసి సినిమా ఫ్లాప్ అవ్వడం తో ఆ ఎఫెక్ట్ ఇప్పడు చాలా మంది మీద చూపిస్తుంది. ఒక సినిమా హిట్ అయితే దాని ఇంపాక్ట్ పాజిటివ్ గా ఎంత అయితే ఉంటుందో ఫ్లాప్ అయిన దాని ఇంపాక్ట్ అంతే నెగటివ్ గా ఉంటుంది. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మరొకరు మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్. ఎందుకంటే అజ్ఞాతవాసిలో చాన్స్ రావడంతోనే మరో రెండు మూడు సినిమాలు చేతిలో పడ్డాయి.

Image result for agnathavasi heroine

అందువల్ల వాటిలో ఏవి హిట్ అయినా, కెరీర్ మళ్లీ ముందుకు వెళ్లిపోతుంది. నిజానికి అజ్ఞాతవాసిలో చాన్స్ రావడం నిజంగా అదృష్టమే. రాజ్ తరుణ్ లాంటి చిన్నహీరో పక్కన నటించిన తరువాత పవర్ స్టార్ పక్కన నటించే చాన్స్ రావడం. అయినా ప్రస్తుతానికి నిరాశే మిగిలింది. ఇక మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్. చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తెలుగులో భారీ సినిమాలకు మ్యూజిక్ డైరక్టర్ కొరత అపారంగా వుంది. దేవీ ఫుల్ బిజీ.

Image result for anirudh

రెమ్యూనిరేషన్ చాలా ఎక్కువ. థమన్ రోటీన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అనూప్ పక్కా క్లిక్ కాలేకపోతున్నాడు. అందువల్ల తెలుగులో వేకెన్సీ చాలా అంటే చాలా వుంది. అలాంటి టైమ్ లో ఈ ఎంట్రీ కనుక క్లిక్ అయివుంటే అనిరుధ్ చేతిలో అరడజను సినిమాలు వుండేవి. అసలు అజ్ఞాతవాసి వల్ల పెద్ద దెబ్బ తిన్నది అనిరుధ్ నే. రాబోయే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్టు వుంటే ఒకె. మరో ప్రయత్నం చేసి సక్సెస్ కావడానికి అవకాశం వుంది. అది చేజారిందా? ఇక తెలుగులో డోర్ మూసుకుపోయినట్లే. ఫిలిం ఇండస్ట్రీ లో విజయం వచ్చినప్పుడు ఆకాశం లో ఉన్నట్లు చూస్తారు. అపజయం వచ్చినప్పుడు పాతాళంలో ఉన్నట్లు చూస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: