‘అజ్ఞాతవాసి‘ మూవీలో పవన్ తండ్రి ప్రతివిషయంలోను ఆలోచిస్తూ ప్లాన్ ‘ఎ’ వర్కౌట్ కానప్పుడు ప్లాన్ ‘బి’ ని రెడీ చేసి పెట్టుకుంటాడు. అయితే ఈ ప్లాన్స్ ఏమి ‘అజ్ఞాతవాసి’ ని చూసిన ప్రేక్షకులను ఏమి మెప్పించలేకపోయాయి. అయితే ఈసినిమా విడుదల కాకుండానే నాగార్జున తన సినిమాల వ్యాపారం విషయంలో అనుసరించిన ప్లాన్ బి ఫెయిల్యూర్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

 HELLO MOVIE  LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన అఖిల్ ‘హలో’ మూవీని కొనుక్కుని నష్టపోయిన బయ్యర్లకు వారి నష్టాలకు ప్రతిఫలంగా నాగార్జున తన సొంత బ్యానర్ పై నిర్మించిన ‘రంగుల రాట్నం’ సినిమా రైట్స్ ను ఇచ్చాడు అన్న ప్రచారం జరిగింది. బాలకృష్ణ పవన్ ల పోటీ మధ్య ఈచిన్న సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెపుతూ గత సంవత్సరం చిరంజీవి బాలయ్యల పోటీ మధ్య విడుదలై విజయం సాధించిన ‘శతమానం భవతి’ ని ఉదాహరణగా తన బయ్యర్లకు చూపెట్టాడు అన్న వార్తలు వచ్చాయి.

 సంబంధిత చిత్రం

అయితే అప్పటికే ‘హలో’ ద్వారా నష్టపోయిన బయ్యర్లు ఇప్పుడు మళ్ళీ ‘రంగుల రాట్నం’ తో కూడ నష్టపోవడంతో నాగార్జునను నమ్ముకున్న బయ్యర్లకు నష్టాలు తగ్గడంపోయి రెట్టింపు అయ్యాయి అన్న వార్తలు వస్తున్నాయి. చిన్న సినిమాగా విడుదలైన ‘రంగుల రాట్నం’ అటు యూత్ ని ఇటు క్లాస్ ప్రేక్షకులని ఎవర్ని మెప్పించలేకపోవడంతో ఈసినిమాకు ప్రస్తుతం కలక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి అని వార్తలు వస్తున్నాయి.

 NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో నాగార్జున తన కొడుకు అఖిల్ ‘హలో’ తో నష్టపోయిన బయ్యర్లకు ఎంతోకొంత నష్ట పరిహారం ఇచ్చి ఈ సమస్య నుండి బయట పడతాడా ? లేదంటే ‘హలో’ బయ్యర్ల కోసం మరో చిన్న సినిమాను తన అన్నపూర్ణ స్టూడియోస్ పై తీసి మరో ప్రయోగం చేస్తాడా ? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ లోని పవన్ తండ్రి పాత్ర కోసం వ్రాసిన యాక్షన్ ‘బి’ ప్లాన్ నాగార్జునకు కూడ వర్కౌట్ కాలేదు అన్న జోక్స్ వినిపిస్తున్నాయి..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: