టాలీవుడ్ మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా దారుణంగా ఫ్లాప్ అవడం జరిగింది...సినిమా మొదటి షో పడినప్పటినుంచి మిక్స్డ్  టాక్ రావడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. మరోపక్క ఈ సినిమాను భారి మొత్తం చెల్లించి బయ్యర్లు కొనుక్కోవడం జరిగింది.

ఈ నేపథ్యంలో సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో అజ్ఞాతవాసి బయ్యర్లను నిండా ముంచేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల లెక్కల ప్రకారం ‘అజ్ఞాతవాసి’ కనీసం రూ.60 కోట్ల మేర బయ్యర్లను ముంచబోతోందని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. గతంలో తన సినిమా బయ్యర్లు నష్టపోతున్న ప్పుడు పవన్ కళ్యాణ్  తన రెమ్యూనరేషన్ వదులుకున్న సందర్భాలున్నాయి.

కానీ ఈ మధ్య పవన్ రాజకీయాలలో వెళ్ళినప్పటి నుండి మనసు కఠినంగా మారిపోయింది. నష్టాల గురించి పట్టించుకోకుండా తన మానాన తాను వెళ్లిపోతున్నాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కారణంగా దారుణ నష్టాలు చవిచూసిన బయ్యర్లు రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. అయినా పవన్ స్పందించలేదు. ఆ సినిమా బయ్యర్లను ‘కాటమరాయుడు’తో ఆదుకుంటాడన్న ప్రచారం ఉత్తదే అయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: