ఈ మద్య ప్రపంచలో మహిళలపై కొంత మంది కామాంధులు జరుపుతున్న అత్యాచారాలు, హత్యలకు హద్దు లేకుండా పోతుంది.  ఇక భారత దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇక లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా ఈ ఇబ్బందులు తప్పడం లేదు.  ఆ మద్య మాళీవుడ్ హీరోయిన్ భావన పై ఆమె డ్రైవర్ లైంగిక వేధింపులకు తెగబడ్డాడు..ఆ విషయంపై భావన పోరాటం చేసి వారికి శిక్ష పడేలా చేసింది. 
Image result for Pak Actress Saba Qamar
నటి భావన తెగువ చూసి చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పెదవి విప్పారు.  తాజాగా ఇర్ఫాన్‌ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌ సినిమా ’హిందీ మీడియం’లో నటించిన సబా కమర్‌ తాజాగా వెక్కివెక్కి ఏడ్చారు. ఓ టీవి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జార్జియాలోని తబ్లిసికి వెళ్లినప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఆమె వివరించారు.
hindi medium teaser
‘పాకిస్థాన్‌లో ఉండి మనం పాకిస్థాన్‌ జిందాబాద్‌. పాకిస్థాన్‌ జై అంటూ ఎన్నో నినాదాలు చేస్తాం. కానీ మనం బయటకు వెళ్లినప్పుడు మన పట్ల జరిగే తనిఖీలు ఎంత దారుణంగా ఉంటాయో నేను చెప్పలేను. ఎంతో అవమానకరంగా ఈ తనిఖీలు జరుపుతారో వివరించడం కష్టం అని అన్నారు.  భారతీయ చిత్రయూనిట్‌ తో షూటింగ్‌ కోసం మేం తబ్లిసీ వెళ్లినప్పుడు నన్ను  అదుపులోకి తీసుకొని ప్రశ్నించి.. పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత అధికారులు పంపించారు.

అప్పటికే భారతీయ చిత్రయూనిట్‌ మొత్తం ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయింది.బయట మనకు ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అన్న విషయం ఆ రోజు నాకు తెలిసింది’అంటూ ఎంతో భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకుంటా సబా అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: