వరుస విజయాలతో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని సినిమా అంటే ఇప్పుడు స్టార్ సినిమాలు సైతం పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో దుమ్ముదులిపేస్తున్న నాని రీసెంట్ గా ఎం.సి.ఏ తో కూడా మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు నాని. 


సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తున్న నాని సినిమా అవుట్ పుట్ పై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. జెండాపై కపిరాజు సినిమా తర్వాత నాని చేస్తున్న డ్యుయల్ రోల్ సినిమా ఇదే అని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా నాని వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా బాగున్నాయి. ఇక సినిమా నుండి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. కచ్చితంగా నాని మరో హిట్ కొడతాడని అనిపిస్తుంది.


ఇక నాని కృష్ణార్జున యుద్ధం సినిమా ఓవర్ సీస్ లో 4.14 కోట్లకు మాగ్నస్ మీడియా కొనేసింది. నాని బిజినెస్ ఈ రేంజ్ లో జరగడం షాక్ అని చెప్పాలి. దాదాపు స్టార్ హీరోల సినిమా రేంజ్ లో నాని సినిమా బిజినెస్ జరగడం విశేషం. ఇక ఈ సినిమా 1 మిలియన్ మార్క్ సాధిస్తే సూపర్ హిట్ కొట్టినట్టే.


వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో హిట్స్ కొట్టిన మేర్లపాక గాంధి కృష్ణార్జున యుద్ధంతో నానికి హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తంజ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్ 14న రిలీజ్ అవనున్న ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: