తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో 90వ దశకంలో ఎన్నో హాస్యభరిత చిత్రాల్లో నటించి కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ కన్నడ నటుడు దర్శకుడు, నిర్మాత కాశీనాథ్ గురువారం ఉదయం కన్నుమూశారు.  గత కొంత కాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.  ఈ వారంలోనే సినిమా ఇండస్ట్రీలో పలు విషాదాలు వరుసగా  చోటు చేసుకున్నాయి.  రెండు రోజుల క్రితం మళయాళ నటుడు నటుడు సిద్ధు ఆర్‌ పిళ్లై గోవా బీచ్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే.. దీంతో సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
Image result for kannada actor kashinath
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డబ్ల్యూబి రావు మృతిచెందాడనే మరో వార్త భారతీయ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కలచివేసింది. ఇదిలా ఉండగా నటుడు కాశీనాథ్ మరణం సినిమా ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది.  కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న కాశీనాథ్ రెండు రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెంగళూరులోని శంకర కేన్సర్ ఆసుపత్రిలో చేర్చారు...కాగా చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూశారు. 
Image result for kannada actor kashinath telugu movies
40 పైగా సినిమాల్లో నటించిన కాశీనాథ్, 13 చిత్రాలను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలకు సంగీత దర్శకుడిగానూ పనిచేశారు.  కాశీనాథ్ కన్నడ నటుడు అయినా..ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి.  ఆ రోజుల్లోనే ద్వంద అర్థాల డైలాగులతో తీసిన ‘పెద్దల’ సినిమాలతో కాశీనాథ్ ఫేమస్ అయ్యారు.
Image result for kannada actor kashinath telugu movies
కాశీనాథ్ చివరగా ‘చౌక’ సినిమాలో నటించారు. ప్రముఖ కన్నడ నటులు ఉపేంద్ర, వి.మనోహర్ తదితరులను ఆయన సినీ రంగానికి పరిచయం చేశారు. కాశీనాథ్ నటించిన  అనుభవం, వింత శోభనం, పొగరుబోతు పెళ్లం, సుందరాంగుడు, భూలోకంలో రంభ ఊర్వశీ మేనక వంటి అడల్డ్ కామెడీ సినిమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కాశీనాథో మృతికి కన్నడ చిత్రసీమ సంతాపం ప్రకటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: