తన చిట్టినడుముతో తెలుగు ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన గోవా బ్యూటీ ఇలియానా.. తన సోయగాలతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్డం ఎంజాయ్ చేస్తున్న అమ్మడు బీ టౌన్ నుండి హాట్ ఆఫర్ రాగానే అక్కడికి జంప్ అయ్యింది. బర్ఫీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అక్కడ అంతంత మాత్రమే క్రేజ్ తెచ్చుకుంది.


ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చినా చిన్న చూపు చేసిన ఇలియానా ఇప్పుడు అవకాశాలు లేక డీలా పడ్డది. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమ పెళ్లి చేసుకుందన్న వార్తలు వచ్చినా వాటికి ఆదారాలు మాత్రం దొరకలేదు. ఇక ఇప్పుడు ఎలాగు సినిమాలో అవకాశాలు రావట్లేదు కదా అని అమ్మడు ఇక ఇప్పుడు సీరియల్స్ లో నటించేందుకు సిద్ధమైందట. 


హాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా క్వాంటికో సీరీస్ లాగా ఈ అమ్మడు కూడా హాలీవుడ్ సీరియస్ లో రెచ్చిపోతుందేమో చూడాలి. ప్రస్తుతం ఇలియానా సీరియల్స్ చేస్తుంది అన్నది మాత్రమే తెలుగు కాని అవి బాలీవుడ్ లోనా హాలీవుడ్ సీరియల్స్ నటిస్తున్నా అన్నది తెలియాల్సి ఉంది. ఇదో రకంగా ఇలియానా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.


తన చిట్టినడుము సోయగాలతో హుశారెత్తించేసిన అమ్మడు ఇప్పుడు సీరియస్ లో అంటే ఇక తిరుగులేదని చెప్పొచ్చు. నిన్నమొన్నటిదాకా తెలుగు, హింది సినిమాల ఛాన్సుల కోసం ఎదురుచూసిన అమ్మడు ఇప్పుడు సీరియల్స్ కు సిద్ధమవడం ఆశ్చర్యకరమైన విషయం. మరి అమ్మడు సీరియల్స్ లో ఇంకెంత రెచ్చిపోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: