ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అను నేను సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ సిఎంగా ఎలా ఉంటాడో అన్న ఎక్సయిట్మెంట్ ఫ్యాన్స్ లో పెరిగింది. అయితే సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ సినిమాలో సిఎం పాత్ర చేయడం కన్నా ఆల్రెడీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఈ సినిమా చేస్తే ఎలా ఉండేదో అననుకుంటున్నారు.


ఈ సినిమా కథ ఎందుకు కేవలం మహేష్ కు చెప్పాడు శివ.. పవన్ కు చెప్పి కాదనిపించుకున్నాడా అని అంటున్నారు. అయితే శ్రీమంతుడు సినిమాతో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ ను అందరికి అర్ధమయ్యేలా.. మనసులు గెలిచేసిన కొరటాల శివ ఈసారి తన కోణంలో సిఎం ఎలాంటి పనులు చేయాలో ఎలా చేస్తే ప్రజలు బాగుపడతారో అని ఈ సినిమా ద్వారా చూపిస్తున్నాడు.


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మరో శ్రీమంతుడు అవడం పక్కా అంటున్నారు. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపుల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. 


ఇక సినిమా టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఏప్రిల్ 27 రిలీజ్ డేట్ కన్ఫాం చేసిన చిత్రయూనిట్ ఈ నెల 26న ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా టీజర్ తో కూడా వస్తారని తెలుస్తుంది. మరి మహేష్ కొరటాల శివ సూపర్ హిట్ క్రేజీ కాంబినేషన్ పై వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: