యాంకర్ అనసూయ అంటే తెలుగు రెండు రాస్ట్రాల బుల్లితెర ప్రేక్షకులే కాదు యూట్యూబ్ ఆడియెన్స్ కూడా ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా సరే అనసూయ చేసే హాట్ షో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక అనసూయ లాంటి అమ్మడు అత్త పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం.


ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ మేనత్త పాత్రలో నటిస్తుందని అన్నారు. మొన్నామధ్య అనసూయ ఆ సినిమాలో తన పిక్ కూడా షేర్ చేయడంతో అంతా ఆమెను అత్తగా ఫిక్స్ అయ్యారు. అయితే అనసూయ మాత్రం రంగస్థలంలో తన పాత్ర అత్త కాదని అంటుంది. రీసెంట్ గా తన ఫ్యాన్స్ తో ఫేస్ బుక్ చాట్ చేసిన అనసూయ తను అలంటి క్యారక్టర్ చేయట్లేదని చెప్పింది.


జబర్దస్త్ లో అందాల విందు కురిపించే అమ్మడు సుక్కు సినిమాలో ఎలా అభిమానులను అలరించనుంది అన్నది తెలియాల్సి ఉంది. ఓ పక్క కామెడీతో కితకితలు పెడుతుంటే మరో పక్క జబర్దస్త్ అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ తో రష్మి దుమ్ముదులిపేస్తున్నారు. బుల్లితెరను షేక్ చేస్తూనే సినిమాల మీద దృష్టి పెట్టింది అనసూయ అందుకే వచ్చిన ప్రతి ఛాన్స్ అదరగొడుతుంది.


మొన్నామధ్య విన్నర్ సినిమాలో సూయ సూయ అంటూ సాయి ధరం తేజ్ తో ఐటెం నెంబర్ చేసిన అమ్మడు. చరణ్ సినిమాలో మంచి పాత్రే దక్కించుకుందట. రంగస్థలం సినిమాలో స్పెషల్ నెంబర్ గా పూజా హెగ్దె నరించనుందని తెలుస్తుంది. ఫుల్ ప్యాకేజీలా రానున్న ఈ సినిమా చరన్ కెరియర్ లో కొత్త జోష్ తెస్తుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: