బాహుబలి 2’  విడుదలై ఎనిమిది నెలలు దాటిపోయినా ఈసినిమా బుల్లి తెర పై అనేకసార్లు ప్రసారం అయినా ఈమూవీ పై జనంలో క్రేజ్ తగ్గలేదు అని చెప్పడానికి సంబంధించిన మరో ఆశక్తికర సంఘటన లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది తమిళనాడు మదురై పట్టణంలో మదురై ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ స్థానిక తముక్కం గ్రౌండ్స్ లో భారీస్థాయిలో ‘బాహుబలి’ మ్యూజియంను ఏర్పాటు చేసింది. అందులో ‘బాహుబలి’  సినిమాలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలు పాత్రలు అన్నింటిని విగ్రహాల రూపంలో ప్రతిష్టించి ప్రదర్శన నిర్వహిస్తునారు.

bahubali2 latest photos కోసం చిత్ర ఫలితం 

మన తెలుగురాష్ట్రం కాకపోయినా తమిళ నాడులో నిర్వహించబడుతున్న ఈప్రదర్శనను చూడడానికి జనం విపరీతంగా రావడమే కాకుండా ఆ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన విగ్రహాల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ తెగ హడావిడి చేయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు ఊహించిన దాని కంటే భారీ రెస్పాన్స్ రావడం వల్ల  ఈప్రదర్శన నిర్వాహకులు ఫుల్ జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.   

 bahubali2 latest photos కోసం చిత్ర ఫలితం

ఇది ఇలా ఉడగా ఈ ప్రదర్శనలో ప్రదర్శింప పడుతున్న  కట్టప్ప తల మీద అమరేంద్ర బాహుబలి కాలు పెట్టడం భారీ దున్నపోతుతో భల్లాల దేవా ఫైట్ చేయటం దేవసేన శివగామి విగ్రహాల పట్ల తమిళ ప్రజలు విపరీతమైన ఆసక్తి కనపరుస్తున్నారు. వాస్తవానికి ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉండే తమిళనాడులో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా విడుదలై నెలలు గడిచిపోతున్నా  తమిళ తంబీలు ఈ విధంగా బాహుబలి పట్ల అందులోని పాత్రల పట్ల  చూపిస్తున ఈమ్యానియాకు సంబంధించి పూర్తి క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది అంటూ తమిళ మీడియా రాజమౌళి పై ప్రశంసలు కురిపిస్తోంది.

bahubali2 latest photos కోసం చిత్ర ఫలితం 

ఇది ఇలా ఉండగా  రెండు నెలల క్రితం యూట్యూబ్ లో అఫీషియల్ గా ‘బాహుబలి 2’ ని అప్ లోడ్ చేసాక ఇప్పుటి దాకా 80 మిలియన్ వ్యూస్  ఈమూవీ తెచ్చుకుంది. మరో 20మిలియన్లు  తెచ్చుకుంటే  100 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న తొలి తెలుగు సినిమాగా ‘బాహుబలి 2’ కొత్త రికార్డులను క్రియేట్ చేసేరోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి ఈ ‘బాహుబలి’ మ్యూజియం ప్రదర్శన మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ఎప్పుడు నిర్వహించబడుతుందో చూడాలి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: