టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.  ఇండస్ట్రీలోకి మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి  నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా తనదైన మార్క్ చాటుకున్న త్రివిక్రమ్. ఆ తర్వాత  అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో స్టార్ దర్శకుల్లో ఒకరయ్యారు. త్రివిక్రమ్ ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో బంగారు పతకం సాధించాడు.
 మాస్‌కే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్
తెలుగు సినీ నటుల్లో ఆయనకు పవన్ కళ్యాణ్, సునీల్ ఆప్తమిత్రులు. నువ్వే చిత్రం తో దర్శకుని గా తొలి ప్రయత్నం లోనే విజయం సాధించాడు. మహేష్ బాబు హీరో గా దర్శకత్వం వహించిన రెండవ చిత్రం "అతడు" మంచి విజయం సాధించడం తో త్రివిక్రమ్ కు బాగా గుర్తింపు వచ్చింది. హాలీవుడ్ స్థాయిలో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. తరువాత జల్సా, కలేజా, జులాయి, అత్తారింటికి దారేది, అ ఆ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో కలేజా తప్ప మిగిలినవన్నీ ఘనవిజయాలు సాధించాయి.
 మాస్‌కు పవన్ పండుగే
సాఫ్ట్ కామెడీ, రొమాంటిక్ కామెడీ లను చిత్రించడంలో సిద్ధహస్తుడు.పంచ్ డైలాగులకు, విలువలతో కూడిన డైలాగులకు కేరాఫ్ అడ్రస్ త్రివిక్రమ్.  ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  ఈ మద్య వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ భారీ డిజాస్టర్ అయ్యింది. అజ్ఞాతవాసి చిత్రాన్ని త్వరగా మరచిపోయి పవన్ కొత్త సినిమా మొదలు పెట్టాలని ఆయన అభిమానులే కోరుకుంటున్నారు.

టాప్ లేపిన ' అజ్ఞాత‌వాసి ' ప్రీ బుకింగ్ క‌లెక్ష‌న్స్
త్రివిక్రమ్ చిత్రాలతోనే అజ్ఞాతవాసిని దారుణమైన చిత్రంగా అభిమానులే అభివర్ణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాస్ పొటెన్షియాలిటీ గురించి తెలిసి కూడా త్రివిక్రమ్ క్లాస్ కథని ఎంచుకుని దానిని గందరగోళం చేసేశాడు. అత్తారింటికి దారేది కూడా క్లాస్ చిత్రమే. అందులో కామెడీ, సెంటిమెట్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఈ సారి మాత్రం పవన్ అభిమానులు త్రివిక్రమ్ నుంచి అలాంటి కథని ఊహించలేదు. పైగా అందులో అలట్టుకునే అంశాలు లేకపోవడంతో సినిమాకు పెద్ద డ్యామేజ్ జరిగింది.

టాప్ లేపిన ' అజ్ఞాత‌వాసి ' ప్రీ బుకింగ్ క‌లెక్ష‌న్స్
సినిమా దారుణమైన ప్లాప్ టాక్ తోనే తొలివారంలో రూ 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కనీసం యావరేజ్ గా చిత్రం ఉన్నా డిస్ట్రిబ్యూటర్ లందరూ ఇప్పుడు హ్యాపీగా ఉండేవారని అభిమానులు అంటున్నారు. జరిగిన డ్యామేజ్ కొంత వరకైనా తగ్గించడానికి త్రివిక్రమ్ సంక్రాంతి నుంచి వెంకీ నటించిన సన్నివేశాన్ని జత చేశారు. అనుకున్నట్లు గానే ఈ ప్రయత్నం కూడా తుస్సుమంది. ఈ మాత్రం సీన్ కోసం వెంకీని నటింపజేశారా అంటూ త్రివిక్రమ్ పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. దీంతో త్రివిక్రమ్ తప్పు మీద తప్పు చేశాడని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: