నందమూరి సింహం బాలకృష్ణ తన పాత్రల ఎంపికకు సంబంధించి చాలా వైవిధ్యాన్ని చూపెడుతూ తాను నటించే సినిమాల సంఖ్య చాల వేగంగా పరుగులు తీయిస్తున్నాడు. తన కెరీర్ లో 100వ చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాచేసి ప్రశంసలు పొందిన బాలకృష్ణ తన షష్టిపూర్తి సందర్భంగా 60వ ఏట రామానుజాచార్య జీవితాన్ని తెరకెక్కిస్తానని అధికారికంగా ప్రకటించాడు. ‘జైసింహా’ సక్సస్ మీట్ లో బ్రాహ్మణుల సత్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈప్రకటన చేశాడు.

 BALAKRISHNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

బాలయ్య ‘నేను ఎక్కువ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాను. ప్రతి పుస్తకం నుంచి ఎంతోకొంత సారాంశాన్ని గ్రహిస్తాను అలా రామానుజాచార్య జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నా 60వ ఏట రామానుజాచార్య సినిమా చేస్తాను. ఎందుకంటే బ్రహ్మంగారి లాగానే రామానుజాచార్యకు కూడ విశేష చరిత్ర ఉంది. నవసమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారు. అష్టాక్షరి మంత్రాన్ని ప్రసాదించారు. ఆయన జీవితాన్ని దృశ్య రూపంలోకి తీసుకొచ్చేలా ఓ సినిమాను నా షష్టిపూర్తి సందర్భంగా చేయబోతున్నాను.’ అంటూ తన షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించాడు ఈ నందమూరి సింహం.

 BALAKRISHNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

 

వాస్తవానికి బాలయ్య షష్టిపూర్తికి ఇంకా మూడేళ్లు టైం ఉంది. ఈ మూడేళ్ల గ్యాప్ లోఇప్పడు బాలయ్య తీస్తున్న పరుగులు చూస్తూ ఉంటే కనీసం అరడజను సినిమాలు చేసే అవకాశం ఉంది.  ఈలోపున మధ్యలో ఎన్నికల హడావిడి కూడ ఉంది. దీనినిబట్టి చూస్తూ ఉంటే రామానుజాచార్య సినిమా సెట్స్ పైకి రావడాన్కి కనీసం 2020 రావాలి.

 సంబంధిత చిత్రం

ఈలోపున బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ కూడ పూర్తి అయిపోతుంది. అయితే రామానుజాచార్య జీవితానికిసంబంధించి సినిమాకు కావాల్సిన కథ సన్నివేశాల్ని తనే సమకూరుస్తానని అంటున్న నేపధ్యంలో ఈసినిమాకు స్వయంగా బాలకృష్ణ దర్శకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవార్తల సంకేతాలను బట్టి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని సినిమా దర్శకత్వ విషయంలో కూడ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి..

 


మరింత సమాచారం తెలుసుకోండి: