ఫీమేల్ లీడ్ సినిమాలకు టాలీవుడ్ లో ఓ క్రేజ్ తెచ్చిన ఈతరం హీరోయిన్ అనుష్క అనే చెప్పాలి. స్వీటీ అనుష్క అరుంథి సినిమా దాకా కేవలం కమర్షియల్ సినిమాలకే పనికొస్తుందని భావించగా ఆ సినిమా తర్వాత ఆమె లోని సరికొత్త యాంగిల్ అందరికి నచ్చేసింది. అరుంథతి సినిమా రికార్డ్ కలక్షన్స్ తో సంచలన విజయం అందుకుంది.


ఇక ఈ సినిమా తర్వాతనే అనుష్క లీడ్ రోల్ సినిమాలకు ఓ స్పెషల్ ఐకాన్ గా మారింది. ఆ క్రమంలోనే రుద్రమదేవి, బాహుబలి సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి అనుష్క లీడ్ రోల్ లో ప్రత్యేకమైన సినిమా వస్తున్న భాగమతి వార్తల్లో నిలుస్తుంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 


టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేయగా.. సినిమా సెన్సార్ కార్యమ్రాలను పూర్తి చేసుకుని అక్కడ నుండి కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మొదటి భాగం మొత్తం క్యారక్టర్ ఎస్టాబ్లిష్ కు వాడగా.. సెకండ్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వచ్చిందట. సినిమాలో భాగమతి పాత్రలో వచ్చే 20 నిమిషాల ఎపిసోడ్ అదిరిపోతుందని అంటున్నారు.


చూస్తుంటే ఇది కచ్చితంగా అరుంథతి సినిమాలానే హిట్టు పక్కా అనిపిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఆది పినిశెట్టి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: