అభిమానులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే విషయంలో చిరంజీవిది విభిన్న శైలి. మెగా స్టార్ గా వరసపెట్టి సినిమాలు చేస్తున్న సమయంలో కూడ చిరంజీవి ఎప్పుడూ తన అభిమానులను అశ్రద్ధ చేయలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఫ్యాన్స్ ను మేనేజ్ చేసే టెక్నిక్ చిరంజీవికి తెలిసినంతగా మరే టాప్ హీరోకి తెలియదు అంటే అతిశయోక్తి కాదు.

 RANGASTHALAM MOVIE WORKING STILLS NEAR RAJAHMUNDRY కోసం చిత్ర ఫలితం

ఈ నేపధ్యంలో రామ్ చరణ్ సంస్కారానికి మెగా అభిమానులు షాక్ అయిన సంఘటన లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ మూవీ కోసం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రదేశాలలో ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది.

 సంబంధిత చిత్రం

ఒక పాటను ఇప్పుడు అక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే చరణ్ మూవీ షూటింగ్ అని తెలిసిన వెంటనే వేలాది సంఖ్యలో అభిమానులు ఆ షూటింగ్ స్పాట్ కు వచ్చారని తెలుస్తోంది. ఇంతమంది జనం మధ్య కీలకమైన ఈపాట చిత్రీకరణ ఏ కాగ్రతతో ఎలా షూట్ చేయాలి అని సుకుమార్ టెన్షన్ పడుతున్న సందర్భంలో చరణ్ తెలివిగా వ్యవహరించిన తీరుతో ఆ సమస్య పరిష్కారం అయినట్లు వార్తలు వస్తున్నాయి.  

RANGASTHALAM MOVIE WORKING STILLS NEAR RAJAHMUNDRY కోసం చిత్ర ఫలితం 

ఆ షూటింగ్ స్పాట్ కు వచ్చిన అభిమానులను చూసి రామ్ చరణ్ ఎటువంటి అసహనానికి లోనవ్వకుండా ఆప్యాయంగా వారందరికీ నమస్కారం చేసి షూటింగ్ కు అడ్డు తగలవద్దని రిక్వెస్ట్ చేసిన వెంటనే పరిస్థితి అనుకూలంగా మారి చరణ్ చెప్పినట్లుగా షూటింగ్ స్పాట్ కు దూరంగా వెళ్ళి అభిమానులు సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో చరణ్ తన అభిమానులను చూసి చేసిన నమస్కారం వెనుక అంత పవర్ ఉందా అంటూ ఆ షూటింగ్ స్పాట్ లో ఉన్న ‘రంగస్థలం’ యూనిట్ వర్గాలు తమలో తాము కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..   

 


మరింత సమాచారం తెలుసుకోండి: