సంక్రాంతి అంటే టాలీవుడ్ కి చాలా ఇష్టమని అందరికి తెలిసిన విషయమే. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా అన్ని రిలీజ్ అవుతాయి. కాన్సెప్ట్ మీద కొంచెం నమ్మకం ఉన్నా సరే పోటీగా పెద్ద సినిమాలు ఉన్నా కూడా చిన్న సినిమాల నిర్మాతలు డేర్ చేసి సినిమాలని రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన అన్ని సినిమాలు బావుంటే తప్పకుండా ప్రేక్షకులు అన్ని చూస్తారని నిర్మాతల్లో ఓ నమ్మకం గట్టిగా ఉంది. ఇక 2016 నుంచి విడుదలైన సంక్రాంతి సినిమాలను చూసుకుంటే గత ఏడాది వరకు సక్సెస్ రేట్ బాగానే ఉంది. కానీ ఈ ఏడాదికి వచ్చే సరికి సంక్రాంతి నాడు టాలీవుడ్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది.


2016 లో వచ్చిన నాన్నకు ప్రేమతో - ఎక్స్ ప్రెస్ రాజా - డిక్టేటర్ - సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంత చెలుకున్నాయి. ఎవరి మార్కెట్ కి తగ్గట్టు వారు లాభాలను కూడా చూశారు. ఫైనల్ గా ఆ నాలుగు సినిమాలు సమానంగా రిలీజ్ అయ్యి అటు నిర్మాతలకి ఇటు బయ్యర్లకు సంక్రాంతి ఆనందాన్ని సంతృప్తిగా ఇచ్చాయి. అదే తరహాలో 2017 సంక్రాంతి సీజన్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఖైదీ నెంబర్ 150 - గౌతమి పుత్ర శతకర్ణి - శతమనం భవతి. ఈ సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా వినూత్నంగా తెరకెక్కడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు త్రిబుల్ ధమాకా ఆఫర్ వచ్చినట్లు అయ్యింది. అన్ని సినిమాలు.మంచి కలెక్షన్స్ ని అందుకున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ముగ్గురు హీరోలు వారి కెరీర్లో అత్యధిక వసూళ్లను ఆ సంక్రాంతికే అందుకున్నారు.


ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతి అంతా అజ్ఞాతవాసిదే అనుకున్నారు. కానీ పండగ ముందు రోజే సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో కొంచెం కూడా కొలుకోలేదు. దారుణమైన నష్టాలను చూడాల్సి వచ్చింది. ఇక జై సింహా కూడా రొటీన్ ఫార్ములతో వచ్చి ప్లాప్ లిస్ట్ లో చేరింది.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన సూర్యా డబ్బింగ్ చిత్రం గ్యాంగ్ పరవాలేదు అనిపించేలా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ పెద్దగా ఏమి రాలేవు. వీరందరికంటే కొంచెం బెటర్ గా రాజ్ తరుణ్ రంగుల రాట్నం ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ సినిమాలో కూడా కొంచెం రంగు తక్కువవ్వడంతో అనుకున్నంత రేంజ్ లో హిట్ అవ్వలేదు. మొత్తానికి 2018 సంక్రాంతి లో టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యిందని విమర్శకులు కామెంట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: