స్టార్ హీరోల్లో ప్రస్తుతం రేసులో కాస్త వెనుకపడ్డది ఎవరు అంటే అది కచ్చితంగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అనే చెప్పుకోవచ్చు. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ ఫ్లాపుల తర్వాత ధ్రువ సినిమాతో హిట్ అందుకున్నాడు చరణ్. ఇక మళ్లీ మరో ఏడాది గ్యాప్ ఇచ్చేశాడు. అయితే రానున్న రెండేళ్లు మాత్రం రాం చరణ్ ను టచ్ చేయాలంటే కష్టమే అనేలా పరిస్థితి ఉందని అంటున్నారు.


2018, 19 కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు పండుగే అంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం సినిమా చేస్తున్న రాం చరణ్ కెరియర్ లో కొత్త ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరో పక్క బోయపాటి శ్రీను సినిమా కూడా చేస్తున్న చరణ్ ఆ సినిమాతో మిగులు పడిన రికార్డులను సృష్టించడం ఖాయమని అంటున్నారు.


ఇక ఇవేవి అంచనాలను అందుకున్నా లేక పోయినా రాజమౌళితో చేసే మల్టీస్టారర్ సినిమా అయినా సరే మరోసారి సంచలనాలు సృష్టించడం ఖాయమని తెలుస్తుంది. అక్టోబర్ లో మొదలవనున్న ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే కాదు హిందిలో కూడా రిలీజ్ అవనుంది. 


కాబట్టి 2018, 19 సంవత్సరాల్లో రాం చరణ్ కెరియర్ పీక్స్ లోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. వరుసగా మూడు సినిమాలు క్రేజీవే కావడంతో ఈ సినిమాలు కనుక హిట్ అయితే మళ్లీ టాప్ లీగ్ లో చరణ్ ముందుంటాడని తెలుస్తుంది. స్టార్ ఫైట్ జరుగుతున్న ఈ సందర్భంలో మెగా పవర్ స్టార్ తన సత్తా చూపేందుకు అన్నివిధాలుగా సెట్ రైట్ చేసుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: